iDreamPost
android-app
ios-app

విక్రమ్ వేద.. తెలుగు రీమేక్ ఇంకా హోల్డ్ లో ఉందా..?

  • Author ajaykrishna Updated - 03:26 PM, Sat - 26 August 23
  • Author ajaykrishna Updated - 03:26 PM, Sat - 26 August 23
విక్రమ్ వేద.. తెలుగు రీమేక్ ఇంకా హోల్డ్ లో ఉందా..?

ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి రీమేక్ అవ్వడం మామూలే. కొన్నేళ్లుగా ఈ రీమేకుల కల్చర్ ని చూస్తున్నాం. ముఖ్యంగా తెలుగులో ఇతర భాషల సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. మరి వేరే భాషలో ఆల్రెడీ సూపర్ హిట్ అయ్యాక.. ఇక్కడ తగ్గితే ఊరుకుంటారా! ఎవరైనా రీమేక్ అంటే.. ఒరిజినల్ కి మించి ఉండాలని అనుకుంటారు. కానీ.. అలా అన్ని సినిమాలకు కుదరదు. ఒరిజినల్ ఫీల్ ని బీట్ చేయడం ఎప్పుడో ఓసారి రేర్ గా జరుగుతుంటుంది. టాలీవుడ్ లో ఇప్పటిదాకా చాలా మలయాళం, తమిళ సినిమాలు రీమేక్ అయ్యాయి. కానీ.. కొన్నేళ్లుగా ఓ సినిమా రీమేక్ మాత్రం హోల్డ్ లోనే ఉండిపోయింది.

ఆ ఒక్కటీ.. తమిళ మూవీ విక్రమ్ వేద. విజయ్ సేతుపతి – మాధవన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2017లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దర్శకులు పుష్కర్ గాయత్రి ఈ సినిమాను యాక్షన్ క్రైమ్ జానర్ లో రూపొందించారు. అయితే.. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ అయినప్పటి నుండే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మధ్యలో ఆల్రెడీ హీరోలు కూడా ఫిక్స్ అయ్యారని.. త్వరలోనే పూర్తి కాస్ట్ అండ్ క్రూని అనౌన్స్ చేయనునట్లు వార్తలొచ్చాయి. సరే మొత్తానికి ఓ మంచి సినిమా తెలుగులోకి.. తెలుగు హీరోలతో రాబోతుందని అందరు భావించారు. కట్ చేస్తే.. ఇప్పటికి సినిమా వచ్చి ఆరేళ్లు అవుతోంది. తెలుగు రీమేక్ అనే మాట వినిపిస్తుంది తప్ప.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఒక్క ఇంచ్ కూడా కదలలేదు. కానీ.. మొదటి నుండి ఓ హీరో పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది.

ఆ హీరో ఎవరో కాదు.. మాస్ రాజా రవితేజ. మరి రవితేజ ఇందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ చేస్తాడా లేక మాధవన్ క్యారెక్టర్ చేస్తాడా ఏది క్లారిటీ రాలేదు. అయితే.. మొదట్లో రవితేజతో పాటు పవన్ కళ్యాణ్, నాగార్జున పేర్లు కూడా వినిపించాయి. ఆ తర్వాత ఎవరిదీ కన్ఫర్మ్ కాలేదని తెలిసింది. ఇప్పుడు తాజాగా మరోసారి విక్రమ్ వేద తెలుగు రీమేక్ అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ గతేడాది హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ లతో హిందీలో రీమేక్ చేశారు ఒరిజినల్ డైరెక్టర్స్. కానీ.. దాని ఫలితం నిరాశపరిచింది. ఆ ఫలితం చూశాక కూడా ఇప్పుడు తెలుగు రీమేక్ అని వినిపించేసరికి.. ఈ ప్రాజెక్ట్ ఇంకా హోల్డ్ లోనే ఉందా? ఎప్పుడో పక్కన పెట్టరేమో అనుకున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. తెలుగులో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ రీమేక్ చేస్తాడని టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. మరి విక్రమ్ వేద తెలుగు రీమేక్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet