iDreamPost
android-app
ios-app

రాజమౌళి ‘మహాభారతం’ మొదలుపెట్టేది అప్పుడే: విజయేంద్రప్రసాద్

  • Author ajaykrishna Published - 05:20 PM, Mon - 10 July 23
  • Author ajaykrishna Published - 05:20 PM, Mon - 10 July 23
రాజమౌళి ‘మహాభారతం’ మొదలుపెట్టేది అప్పుడే: విజయేంద్రప్రసాద్

దర్శకదిగ్గజం రాజమౌళి గురించి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక క్రేజ్, గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఓ రకంగా ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో నిలిపిన డైరెక్టర్ గా రాజమౌళి పేరొందాడు. కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా.. తాను పట్టిందల్లా బంగారమే అవుతుందని రాజమౌళి దాదాపు తన ప్రతీ సినిమాతో ప్రూవ్ చేస్తూ వచ్చాడు. కానీ.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ల విషయానికి వస్తే.. రాజమౌళి పట్టిందల్లా బంగారం కాదు.. ఈసారి డైమండ్ అనే రేంజ్ కి అంచనాలు పెరిగిపోయాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ యాక్షన్ అడ్వంచర్ మూవీ ప్లాన్ చేశాడు.

ఆ సినిమా గ్లోబ్ ట్రోటరింగ్ జానర్ లో సాగుతుందని కూడా ప్రకటించాడు. అయితే.. అప్పటినుండి మహేష్ రాజమౌళిల కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ మహేష్.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా అయిపోగానే రాజమౌళి మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ క్రమంలో రాజమౌళి సినిమాలకు కథలు అందించే ఆయన తండ్రి వి. విజయేంద్రప్రసాద్.. తాజాగా రాజమౌళి తదుపరి సినిమా గురించి, రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చారు. మహేష్ బాబుతో సినిమా ఆర్ఆర్ఆర్ కి మించి ఉండబోతుందని ఆయన చెప్పారు.

అనంతరం మహాభారతం గురించి మాట్లాడుతూ.. ‘మహేష్ తో సినిమా అవ్వగానే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం స్టార్ట్ చేస్తాం. ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ రెడీ చేస్తున్నాం. అది హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది. కానీ.. డైరెక్షన్ రాజమౌళి చేస్తాడా లేదా అనేది చెప్పలేం. ఒకవేళ వేరే డైరెక్టర్ చేసినా.. అది రాజమౌళి పర్యవేక్షణలోనే రూపొందుతుంది.’ అని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. అయితే.. మహాభారతం అనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆల్రెడీ అందరికీ తెలిసిందే. “చాలా భారీగా.. టెక్నికల్ గా కూడా హై స్టాండర్డ్స్ లో మహాభారతం తీయాలి. ఇండియన్ స్టోరీస్ ని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ మొదలు పెడితే.. మహాభారతం మినిమమ్ పది భాగాలుగా ఉంటుందని నేను అనుకుంటున్నా” అని గతంలో రాజమౌళి చెప్పిన మాటలు. మరి మహాభారతం రాజమౌళి డైరెక్షన్ లో తెరపైకి రావాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.