iDreamPost
android-app
ios-app

మహేశ్- రాజమౌళి సినిమా.. కథ అదేనని దైర్యంగా చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్!

రాజమౌళి-మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ..

రాజమౌళి-మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ..

మహేశ్- రాజమౌళి సినిమా.. కథ అదేనని దైర్యంగా చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్!

భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి- సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తోంది. రాజమౌళి-మహేష్‌ల మూవీ కథ రాయటం పూర్తయిందని .. కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ మొన్న మీడియాకు తెలిపారు. ఆ మరుసటి రోజే మూవీ బడ్జెట్‌కు సంబంధించి ఓ న్యూస్‌ వచ్చింది. ప్రముఖ నిర్మాత కేఎల్‌ నారాయణ, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. ప్యాన్‌ వరల్డ్‌ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు.

భారత సినిమా చరిత్రలోనే మొదటి సారి ఇంత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావటం విశేషం. ఇక, ఈ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర అప్‌డేట్లు వచ్చాయి. విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా మరో సారి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్లు రెండు ఇచ్చారు. మూవీకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి అని తెలిపారు. మూవీ కథ మొత్తం హాలీవుడ్‌ హిట్‌ సిరీస్‌ ఇండియానా జోన్స్‌లా ఉంటుందని అన్నారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…’

That's the story of the Mahesh-Rajamouli movie!

‘‘ కథ రాయటం వరకే మా పని ఉంటుంది. ఆ తర్వాత టీంతో మాకు ఇంటరాక్షన్‌ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా డౌట్‌ వస్తే పిలుస్తారు. సినిమాకు సంబంధించి మ్యూజిక్‌ స్టార్ట్‌ అయింది. ఇప్పుడు అవే నడుస్తున్నాయి. మూవీ ఇండియానా జోన్స్‌లా ఉంటుంది. ఒక్కో డైరెక్టర్‌కు ఒక్కో స్టైల్‌ ఉంటుంది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, కాంబినేషన్‌ ప్రకటన వచ్చిన నాటి నుంచే సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి.

మూవీ ఇండియానా జోన్స్‌లా ఉండబోతోందని, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని తెలియటంతో ఆ అంచానలు మరింత పెరిగాయి. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఈ మూవీపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్యాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో మహేష్‌కు పేరు వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ మూవీ విడుదల కావటానికి ఇంకా ఎంతలేదన్నా.. రెండు, మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. మరి, రాజమౌళి- సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సినిమాకు సంబంధించిన వచ్చిన ఈ లేటెస్ట్‌ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.