iDreamPost
android-app
ios-app

దేవర సినిమాలో విజయ్ దేవరకొండ? ఇదేం ట్విస్ట్ భయ్యా!

  • Author ajaykrishna Published - 01:17 PM, Sat - 23 September 23
  • Author ajaykrishna Published - 01:17 PM, Sat - 23 September 23
దేవర సినిమాలో విజయ్ దేవరకొండ? ఇదేం ట్విస్ట్ భయ్యా!

కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలలో వేరే హీరోలు సైతం స్పెషల్ క్యారెక్టర్స్ లేదా క్యామియో రోల్స్ చేసి సర్ప్రైజ్ చేస్తుంటారు. అలాంటి సర్ప్రైజ్ లంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కి కూడా ఇష్టమే. ఎందుకంటే.. ఒకే ఫ్రేమ్ లో ఒకేసారి ఇద్దరు స్టార్స్ ని బిగ్ స్క్రీన్ పై చూస్తే వచ్చే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. పెద్ద హీరో సినిమాలో చిన్న రోల్ అనేసరికి చాలామంది హీరోలు ఒప్పుకోవడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ.. కొందరు స్నేహం, అభిమానం కొద్దీ ఓకే చేస్తుంటారు. ఒక్కోసారి సోలో హీరోగా చేసిన సినిమాలకంటే.. చిన్న రోల్స్ తోనే ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. ఇదివరకు చాలా సందర్భాలలో ఇది ప్రూవ్ అయ్యింది.

గతంలో అల్లరి నరేష్ గమ్యం, శంభో శివ శంభో, మహర్షి సినిమాలలో అలాంటి కీలకపాత్రలు చేసి అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. పైగా ఒక్కో సినిమా తనలోని ఒక్కో యాంగిల్ ని బయటికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’లో.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏంటి దేవరకొండలో దేవర మ్యాచ్ అయ్యిందని ఇలా అంటున్నారా అని డౌట్ రావడం సహజమే. కానీ.. ఇండస్ట్రీ వర్గాలలోనే దేవర సినిమాలో విజయ్ దేవరకొండ చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా నడుస్తుంది.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీలో.. ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండ అడుగుపెడితే.. దేవర క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు విజయ్ కూడా తాను లైనప్ చేసిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. మరి దేవరలో స్పెషల్ క్యారెక్టర్ అంటే చేస్తాడా లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక దేవర సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మరి దేవర గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet GirişjojobetcasibomjojobetcasibombetsmovemariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişJojobet Giriş