iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్‌ నటి కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్‌ నటి కన్నుమూత!

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ఎవరో ఒకరు కన్నుమూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ కన్నడ హీరో విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూసింది. గుండెపోటు కారణంగా ఆమె బ్యాంకాక్‌ టూరులో చనిపోయింది. ఆ తర్వాత హిందీ, తమిళ సీరియల్‌ నటుడు పవన్‌ కూడా గుండెపోటు కారణంగా చనిపోయాడు. ఆ తర్వాత మీర్జాపూర్‌ ఫేమస్‌ పంకజ్‌ త్రిపాఠీ తండ్రి చనిపోయారు. ఇండస్ట్రీ ఈ విషాదాల నుంచి తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి సీమా డియో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె 81 ఏళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు.

ముంబై, బాంద్రాలోని నటుడు, ఆమె కుమారుడు అభయ్‌ డియో ఇంట్లో కన్నుమూశారు. సీమా గత కొన్నేళ్లుగా అల్జీమర్స్‌తో సైతం బాధపడుతున్నారు. ఈ వ్యాధితోనే ఆమె చాలా ఇబ్బందులకు గురైనట్లు సమాచారం. ఇక, తల్లి మరణంపై అభయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బాంద్రాలోని మా ఇంట్లో ఆమె గురువారం ఉదయం 8.30-9 మధ్యలో చనిపోయింది. వృద్దాప్య సమస్యలతో ఆమె కన్నుమూసింది. ఆమెకు అల్జీమర్స్‌ వచ్చింది. డిమెన్షియా కారణంగా అల్జీమర్స్‌ వచ్చింది. ఆమె మరణానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేదు. డిమెన్షియా, అల్జీమర్స్‌ కారణంగా.. ఆమె ఎలా నడవాలో కూడా మరిచిపోయింది.

ఆమె జ్ఞాపకశక్తి కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఒక్కో అవయవం పని చేయటం మానేస్తూ వచ్చాయి’’ అని తెలిపాడు. కాగా, సీమా డియో హిందీతో పాటు మరాటీ సినిమాల్లో కూడా నటించారు. ఆనంద్‌ అండ్‌ కోరా కాగజ్‌ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ నటుడు రమేష్‌ డియోను పెళ్లి చేసుకున్నారు. ఇక, సీమా అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో శివాజీ పార్కులో జరగనున్నాయి. మరి, ఇండస్ట్రీలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.