iDreamPost
android-app
ios-app

Venu Swamy: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై వేణు స్వామి కామెంట్స్!

  • Published Aug 08, 2024 | 7:02 PM Updated Updated Aug 08, 2024 | 7:02 PM

Venu Swamy About Naga Chaitanya-Sobhita Dhulipala: ఇవాళ అనగా గురువారం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్ధ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీరి నిశ్చితార్థం గురించి సంచలన కామెంట్స్ చేశారు.

Venu Swamy About Naga Chaitanya-Sobhita Dhulipala: ఇవాళ అనగా గురువారం నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్ధ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీరి నిశ్చితార్థం గురించి సంచలన కామెంట్స్ చేశారు.

Venu Swamy: నాగ చైతన్య-శోభిత ధూళిపాళ నిశ్చితార్థంపై వేణు స్వామి కామెంట్స్!

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఇవాళ జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్ధ వేడుక జరిగింది. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. దీంతో అక్కినేని అభిమానులు చైతూ, శోభిత జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అక్కినేని ఇంట, నెట్టింట చైతూ, శోభితల నిశ్చితార్థ వేడుక సందర్భంగా సంబరాలు జరుగుతుంటే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సడన్ ఎంట్రీ ఇచ్చారు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.  

తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి గురించి తెలియని వారు ఉండరు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ బాగా పాపులర్ అయ్యారు. నిజానికి వేణు స్వామి పాపులర్ అయ్యిందే నాగ చైతన్య-సమంతల వివాహం. ఆ సమయంలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వల్లే ఆయన ఇంత పాపులారిటీ మూటగట్టుకున్నారు. సమంత, నాగ చైతన్యల విషయంలో తాను చెప్పినట్టే జరిగిందని క్రెడిట్ తన అకౌంట్ లో వేసుకున్నారు. ఇలా కొన్ని విషయాల్లో వేణు స్వామి చెప్పినవి జరగ్గా కొన్ని విషయాల్లో జరగలేదు. సినీ రంగానికి చెందిన వారి జాతకాలే కాదు.. సినిమా జయాపజయాల గురించి కూడా సంచలన కామెంట్స్ చేశారు. ప్రభాస్ సీన్ అయిపోయిందని అన్నారు. కానీ ప్రభాస్ సలార్ 2 ఊచకోత కోసింది. మొన్న వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక్కడ వేణు స్వామి అంచనా తప్పింది. ఆ మధ్య జరిగిన ఎన్నికలప్పుడు కూడా ఆయన ఏపీ, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీలే అంటూ బల్లగుద్ది  మరీ చెప్పారు. కానీ ఈయన చెప్పినట్టు జరగలేదు.

Venu swamy comments on chay and shobitha engagment

దీంతో నెటిజన్స్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇక జాతకాలు చెప్పమని వేణు స్వామి సంచలన ప్రకటన చేశారు. కట్ చేస్తే మరోసారి సీన్ లోకి వచ్చారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ‘నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన, జతకపరమైన విశ్లేషణ రేపు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో చై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వేణు స్వామి ఏం చెప్తారో అంటూ కంగారుపడుతున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ గురించి పాజిటివ్ గానే చెప్తారా? లేక నెగిటివ్ గా చెప్తారా? అన్న టెన్షన్ అక్కినేని ఫ్యాన్స్ వర్గాల్లో మొదలైంది. అసలేం చెప్తారో అన్న టెన్షన్ ఇప్పుడు అక్కినేని అభిమానులను వెంటాడుతోంది. మరి నాగచైతన్య, శోభిత ధూళిపాళ వైవాహిక జీవితం మీద జాతకం చెప్తానని వేణు స్వామి ప్రకటించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.