iDreamPost
android-app
ios-app

వెంకీ సీక్వెల్ తీసే ప్రయత్నాల్లో శ్రీను వైట్ల

  • Published Mar 26, 2024 | 12:12 PM Updated Updated Mar 26, 2024 | 12:12 PM

మాస్ మహారాజ్ రవితేజ, స్నేహ హీరో హీరోయిన్లుగా నటించిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రం వెంకీ. ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇటీవల రీ రిలీజ్ చేస్తే.. మస్తు రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మనందం, రవితేజ కాంబోలో వచ్చిన సీన్స్.. వేరే లెవల్ అంతే.. ఇప్పుడు..

మాస్ మహారాజ్ రవితేజ, స్నేహ హీరో హీరోయిన్లుగా నటించిన ఎంటర్ టైన్ మెంట్ చిత్రం వెంకీ. ఈ సినిమాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇటీవల రీ రిలీజ్ చేస్తే.. మస్తు రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మనందం, రవితేజ కాంబోలో వచ్చిన సీన్స్.. వేరే లెవల్ అంతే.. ఇప్పుడు..

  • Published Mar 26, 2024 | 12:12 PMUpdated Mar 26, 2024 | 12:12 PM
వెంకీ సీక్వెల్ తీసే ప్రయత్నాల్లో శ్రీను వైట్ల

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎవర్ గ్రీన్ ఎంటర్టైనర్ సినిమాల్లో ఒకటి దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన వెంకీ. మాస్ మహారాజా రవితేజ, స్నేహ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగా ఈ సందర్భంగా ఈ సినిమాకి సీక్వెల్ రావచ్చు అన్న వార్త బయటకు వచ్చింది. తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. తన సినిమా రీ-రిలీజ్‌కి వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకీ 2 చేయడానికి ప్రేరణ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెంకీ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ రాస్తున్నారట. ఈ వార్త వింటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంతో ఆనందిస్తారు.

ఇప్పటికైతే తనకు ఈ సీక్వెల్ ఆలోచన ఉన్నా కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు అని శ్రీను వైట్ల అన్నారు. మంచి కథలను కామెడీ జోడించి చెప్పడంలో శ్రీను వైట్ల ఒక దశలో వరుసగా సక్సెస్ అయ్యారు. ఆనందం, సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు, బాద్షా వంటి ఎన్నో ఎంటర్టైనర్లు అందించి ప్రేక్షకులని అలరించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన సినిమాలు మంచి రిపీట్ వాల్యూను కలిగి ఉంటాయి. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూసి ఆనందిస్తూ ఉంటారు.

ముఖ్యంగా రవితేజ ప్రధాన పాత్రలో 2004లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘వెంకీ’ చిత్రానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాల మీద ఎన్నో వేల మీమ్స్ తయారయ్యాయి. అసలు వెంకీ సినిమాలోని సీన్/మీమ్ లేకుండా సోషల్ మీడియాలో మూవీ నెటిజన్లు పోస్ట్ చేయరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆ సినిమా ఆ స్థాయిలో పాపులర్ అయ్యింది. ఇటీవల ఈ సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేయగా హౌజ్ ఫుల్స్ ను నమోదు చేసింది. వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ను ఎవర్ గ్రీన్ కామెడీ ఎపిసోడ్ గా చెప్తుంటారు. ఆ ఎపిసోడ్ లో బ్రహ్మీ, ఏవీఎస్ లను రవితేజ, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు నేటికీ ఆడియో ప్లాట్ ఫారమ్ లలో మోగుతూ ఉంటాయి. మరి వెంకీ సీక్వెల్ పై ఫోకస్ పెట్టిన శ్రీను వైట్ల ప్రయత్నం ఫలించి ప్రేక్షకులకి మరో క్లాసిక్ ఎంటర్టైనర్ అందివ్వాలని ఆశిద్దాం.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique