iDreamPost
android-app
ios-app

Venky-Anil3: వెంకీ-అనిల్ మూవీ.. క్రేజీ అప్డేట్ వదిలిన మేకర్స్!

  • Published Aug 14, 2024 | 2:08 PM Updated Updated Aug 14, 2024 | 2:08 PM

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

  • Published Aug 14, 2024 | 2:08 PMUpdated Aug 14, 2024 | 2:08 PM
Venky-Anil3: వెంకీ-అనిల్ మూవీ.. క్రేజీ అప్డేట్ వదిలిన మేకర్స్!

టాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోలు బిజీబిజీగా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను పట్టాలపైకి ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో సదరు మూవీలకు సంబంధించి లేటెస్ట్, క్రేజీ అప్డేట్స్ తో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురించేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను మేకర్స్ వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ క్రేజీ అప్డేట్ ఏంటంటే?

విక్టరీ వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను 2025 సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలోని పొల్లాచిలో జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగ్ లో విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యాడని తెలుపుతూ మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. అందులో మాజీ పోలీస్ అధికారికగా వెంకీపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన సీన్లను చూపించారు. సెట్లో డైరెక్టర్, హీరో సరదాగా గడిపిన సీన్లను కూడా ఈ వీడియోలో చూపించారు.

venku anil 3 movie update

కాగా.. ట్రైయాంగిల్ క్రైమ్ అండ్ ఎంటర్ టైనర్ జానర్ లో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. మాజీ కాప్ గా వెంకీ ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. దాంతో వింటేజ్ వెంకీనీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. వెంకీ-అనిల్ కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ మూవీలో వెంకీ లుక్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss