iDreamPost
android-app
ios-app

Varun Tej: వరుణ్ తేజ్ కష్టం ఫలిస్తుందా?

  • Published Feb 17, 2024 | 3:06 PM Updated Updated Feb 17, 2024 | 3:06 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన కెరీర్​కు ఈ ఫిల్మ్ చాలా కీలకం కానుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు. చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఆయన కెరీర్​కు ఈ ఫిల్మ్ చాలా కీలకం కానుంది.

  • Published Feb 17, 2024 | 3:06 PMUpdated Feb 17, 2024 | 3:06 PM
Varun Tej: వరుణ్ తేజ్ కష్టం ఫలిస్తుందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిసారిగా 2019లో విడుదలైన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్​తో కలసి నటించిన ‘ఎఫ్2’ బ్లాక్​బస్టర్ అయినా వరుణ్ సోలోగా హిట్ ఇచ్చి చాలా కాలం అయింది. బహుశా అందుకేనేమో ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్​లో పాల్గొంటున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానున్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ తొలిసారిగా ఉత్తరాది మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. అందుకే తన ఫిల్మ్​ను హిందీ ప్రేక్షకులకు కూడా రీచ్ అయ్యేలా సీరియస్​గా ప్రమోట్ చేస్తున్నారు.

2019, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి ఉగ్రవాదంపై పోరులో భారతదేశం ఎదుర్కొన్న సవాళ్లను ఇప్పటికీ గుర్తుచేస్తోంది. ఆ దురదృష్టకరమైన రోజున పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్​ను లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు ఆత్మాహుతి దాడి చేయడంతో 40 మంది వీరజవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2,500 మంది జవాన్లతో కాన్వాయ్ సెలవుపై తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఆ అటాక్ జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, అసాధారణ ధైర్యసాహసాలు చూపి ప్రాణత్యాగం చేసిన వీర భారత సైనికులకు గౌరవ సూచకంగా వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్ర బృందం ఆ ప్రదేశాన్ని ఇటీవలే సందర్శించింది.

యదార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ దేశభక్తి అంశాలతో కూడుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అర్జున్ దేవ్ పాత్రలో వరుణ్ తేజ్, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రెనైసాన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్​ను గాడ్ బ్లెస్ ఎంటర్​టైన్​మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ కథ రాసిన ఈ చిత్రం 2024 మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఇంట్రోవర్ట్​గా పేరున్న వరుణ్ తేజ్ తన సినిమాను హిందీ ప్రేక్షకులకు ప్రమోట్ చేయడానికి వీలైనన్ని ఎక్కువ ప్రయత్నాలు చేయడం చాలా మంచి పని అనే చెప్పాలి. ఈసారి హిట్‌ కొట్టడం ఆయన కెరీర్​కు చాలా కీలకం. కొత్త డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా సరైన కంటెంట్ అందిస్తే ఈ ఫిల్మ్ కచ్చితంగా మంచి ఆదరణ పొందుతుంది. మరి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టాలీవుడ్ పై రాధికా అప్టే ఘాటు వ్యాఖ్యలు! పరువు తీసేలా!

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/