iDreamPost
android-app
ios-app

Varsha Bollamma: ఆ క్రికెటర్ అంటే నాకు పిచ్చి.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Feb 14, 2024 | 1:26 PM Updated Updated Feb 14, 2024 | 1:26 PM

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఎంచుకున్న ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ఆడియెన్స్​ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ కన్నడ కస్తూరి.. తనకు ఓ క్రికెటర్ అంటే పిచ్చి ఇష్టమని అన్నారు.

టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ ఒకరు. ఎంచుకున్న ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ ఆడియెన్స్​ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ కన్నడ కస్తూరి.. తనకు ఓ క్రికెటర్ అంటే పిచ్చి ఇష్టమని అన్నారు.

  • Published Feb 14, 2024 | 1:26 PMUpdated Feb 14, 2024 | 1:26 PM
Varsha Bollamma: ఆ క్రికెటర్ అంటే నాకు పిచ్చి.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వర్ష బొల్లమ్మ.. టాలీవుడ్​లో తక్కువ టైమ్​లోనే మంచి క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్. ‘చూసీ చూడంగానే’తో తెలుగు వారికి ఆమె పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ సరసన నటించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో ఆమె తెలుగులో తొలి విజయాన్ని అందుకున్నారు. డైరెక్ట్​గా ఓటీటీలో రిలీజైన ఆ మూవీలో సంధ్య పాత్రలో ఆమె యాక్టింగ్, ఎక్స్​ప్రెషన్స్ పలికించిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అనంతరం ‘పుష్పక విమానం’, ‘స్టాండప్ రాహుల్’, ‘స్వాతిముత్యం’ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ‘ఊరి పేరు భైరవకోన’తో ఇంకోసారి బిగ్​స్క్రీన్​పై మెస్మరైజ్ చేసేందుకు ఆమె రెడీ అవుతున్నారు. ఈ ఫిల్మ్ ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు విరాట్ కోహ్లీ అంటే పిచ్చి అన్నారు. అతడే తన సెలబ్రిటీ క్రష్ అని చెప్పారు.

టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని వర్ష బొల్లమ్మ అన్నారు. అతడికి తాను బిగ్ ఫ్యాన్ అని చెప్పారు. ‘కోహ్లీకి నేను వీరాభిమానిని. అతడు నా సెలబ్రిటీ క్రష్. చిన్నతనంలో న్యూస్ పేపర్​లో వచ్చే విరాట్ ఫొటోలను కత్తిరించి నా పుస్తకాల్లో భద్రంగా దాచుకొనేదాన్ని. విజయ్ ‘బిగిల్’ మూవీలో ఫుట్​బాల్ ప్లేయర్​గా యాక్ట్ చేసేటప్పుడు పట్టుబట్టి మరీ 18వ నంబర్ జెర్సీ తీసుకున్నా. ఎందుకంటే అది విరాట్ కోహ్లీ ధరించే జెర్సీ నంబర్ కాబట్టి. అతడికి మ్యారేజ్ అయినప్పుడు నా మనసు ముక్కలైనంత పనైంది’ అని వర్ష బొల్లమ్మ చెప్పుకొచ్చారు. కాలేజ్ డేస్​లో ఉన్నప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి విజయ్ దేవరకొండకు ఫ్యాన్​ను అయిపోయానని తెలిపారు. విజయ్ ఫెంటాస్టిక్ యాక్టర్ అని.. కళ్లతోనే ఎలాంటి ఎక్స్​ప్రెషన్స్​ను అయినా ఈజీగా పలికిస్తాడని వర్ష బొల్లమ్మ పేర్కొన్నారు.

I'm crazy about that cricketer!

విజయ్ దేవరకొండతో పాటు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటన కూడా అద్భుతంగా ఉంటుందన్నారు వర్ష బొల్లమ్మ. తనకో డ్రీమ్ రోల్ ఉందన్నారు. ఎప్పటికైనా సరే నెగెటివ్ షేడ్స్ ఉన్న సైకో క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నానని తన మనసులోని కోరికను బయటపెట్టారు. కెమెరా ముందు మేకప్ వేసుకునేందుకు అంతగా ఇష్టపడనని.. సాధ్యమైనంత న్యాచురల్​గా కనిపించేందుకే ఇష్టపడతానన్నారు వర్ష. టాటూలు అంటే తనకు చాలా ఇష్టమని.. అందుకే వాటి కోసం ఎప్పుడూ తన హ్యాండ్ బ్యాగ్​లో ఎప్పుడూ ఓ బేబీ ఆయిల్​ వేసుకుంటానని ఫ్యాన్స్​కు మరో సీక్రెట్ చెప్పేశారు. ఇక, వర్ష బొల్లమ్మ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్​ను వీఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీన ఈ మూవీ వరల్డ్ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మరి.. ‘ఊరి పేరు భైరవకోన’తో వర్ష బొల్లమ్మ మరో హిట్ అందుకుంటారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రష్మీపై తప్పుడు ప్రచారం.. అలా చేయొద్దంటూ ఆవేదన

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet