iDreamPost
android-app
ios-app

బేబీ పంట పండింది! ఇది లక్ కాదు.. కష్టానికి ఫలితం!

  • Published Nov 14, 2023 | 4:18 PM Updated Updated Nov 14, 2023 | 4:18 PM

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే వ్యాఖ్యలకు ఆమె వ్యతిరేకం. టాలెంట్ ఉండాలే గానీ అవకాశాలు వస్తాయి అని నిరూపిస్తోంది పదహారాణాల తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. యూట్యూబ్, షార్ట్ ఫిల్మింస్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు.. బేబీతో ఒక్కసారిగా క్రేజీ నటిగా మారిపోయంది.

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే వ్యాఖ్యలకు ఆమె వ్యతిరేకం. టాలెంట్ ఉండాలే గానీ అవకాశాలు వస్తాయి అని నిరూపిస్తోంది పదహారాణాల తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. యూట్యూబ్, షార్ట్ ఫిల్మింస్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు.. బేబీతో ఒక్కసారిగా క్రేజీ నటిగా మారిపోయంది.

  • Published Nov 14, 2023 | 4:18 PMUpdated Nov 14, 2023 | 4:18 PM
బేబీ పంట పండింది! ఇది లక్ కాదు.. కష్టానికి ఫలితం!

సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల సత్తా చూపించింది వైష్ణవి చైతన్య. ముందుగా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ,వెబ్ సిరీస్ లతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ తెలుగు అమ్మాయి. తరువాత సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ మూవీలో తన నటనతో, తన అందంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను మెప్పించింది. దీంతో.. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఆమెకి క్రేజ్ వచ్చి పడింది. ఇప్పుడు అదే క్రేజ్ తో వరుస అవకాశాలను అందుకుంటుంది వైష్ణవి. ఈ క్రమంలోనే.. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా వైష్ణవితో ఓ సినిమా ఫిక్స్ చేశారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

నూతన దర్శకుడు అరుణ్ భీమవరపు డైరెక్షన్ లో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమా లో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య ను సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తన మొదటి చిత్రంలోనే రిస్క్ తో కూడిన క్యారెక్టర్ కి 100 శాతం న్యాయం చేసిన ఈ నటి.. ఇక ఈ చిత్రానికి దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న హీరోయిన్స్ కి దీటుగా.. ఓ తెలుగు అమ్మాయి ఇంత మొత్తంలో పారితోషికం అందుకోవడం అంటే గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇక.. బేబీ మూవీ హిట్ కావడంతో తనకు వరుస ఆఫర్స్ వచ్చినా కూడా.. సెలెక్టీవ్ గా ముందుకి వెళ్తోంది వైష్ణవి చైతన్య.

ఆనంద్ దేవరకొండతో వైష్ణవి ఇప్పటికే మరో చిత్రానికి ఓకే చెప్పింది. ఇదే కాకుండా.. మరో 2 సినిమాలకి కూడా కమిట్ అయ్యి ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి.. కాకుండా దిల్ రాజు మూవీ ఎలాగో ఉండనే ఉంది. ఇప్పటికే ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఈ తెలుగు అమ్మాయి.. ఇంకొన్ని విజయాలు అందుకుంటే స్టార్ బ్యూటీస్ సరసన చేరిపోవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇదంతా వైష్ణవికి దక్కిన అదృష్టం మాత్రమే కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ళ కష్టం ఉంది. ఆమె కసితో చేసిన ప్రయాణం ఉంది. అన్ని గడ్డు పరిస్థితులను దాటింది కాబట్టే.. ఈరోజు తెలుగు నటీమణులు అందరికీ ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలిచింది. మరి.. వైష్ణవి ఈ స్థాయి అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabet