iDreamPost
android-app
ios-app

ఉపేంద్ర మార్క్ పాట.. తెలుగులో ట్రెండింగ్ మీమ్స్ అన్నీ పెట్టేసి..

Upendra UI Movie: ఉపేంద్ర గురించి సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూఐ అనే సినిమా విడుదలైతే పాన్ ఇండియా లెవల్లో మరోసారి ఉపేంద్ర సత్తా చూపించినట్లు అవుతుంది.

Upendra UI Movie: ఉపేంద్ర గురించి సౌత్ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూఐ అనే సినిమా విడుదలైతే పాన్ ఇండియా లెవల్లో మరోసారి ఉపేంద్ర సత్తా చూపించినట్లు అవుతుంది.

ఉపేంద్ర మార్క్ పాట.. తెలుగులో ట్రెండింగ్ మీమ్స్ అన్నీ పెట్టేసి..

ఉపేంద్ర.. ఈ పేరు తెలియని సౌత్ సినిమా ప్రేక్షకులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. కేవలం కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. నిజానికి సెలబ్రిటీలకు అభిమానులు ఉంటారు. కానీ, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్లే.. ఉపేంద్రకు అభిమానులు అనే విషయం అందరికీ తెలిసిందే. ఉపేంద్ర ఇప్పుడు UI అనే పాన్ ఇండియా సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఒక ట్రోల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అందులో ఏకంగా తెలుగు సెలబ్రిటీలు అందరిపై ఉపేంద్ర సెటైర్లు వేసేశాడు.

నిజానికి ఉపేంద్ర తీసినట్లు సినిమాలు తీయడం, సమాజంలో జరుగుతున్న విషయాలపై సూటి ప్రశ్నలు వేయడం మరొకరికి సాధ్యం కాదేమో? ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్సే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ట్రోల్స్ సాంగ్ అని తాజాగా యూఐ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశాడు. ఆ పాట ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉంది? సెలబ్రిటీలు అయిపోవడానికి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు? ఇన్ స్టాగ్రామ్ రీల్స్, లైక్స్ కోసం ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇన్నాళ్లు ఎలాంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి? ఇలా ఈ పాటలో అన్నింటిని ఎత్తి చూపాడు.

మనుషులు సమాజం, సామాజిక బాధ్యతను వదిలేసి కేవలం టైమ్ పాస్ కోసం ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా అంటూ ఎలా మారిపోయారు అనే విషయాలను ప్రశ్నించాడు. అంతేకాకుండా ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిన విషయాలను ఎద్దేవా చేస్తూ చూపించాడు. అందులో ఏ ఒక్కరినీ వదిలి పెట్టలేదు. రాజకీయ నాయకుల నుంచి బర్రెలక్క దాకా, అర్జున్ రెడ్డి నుంచి కుమారీ ఆంటీ దాకా అందరినీ టచ్ చేశాడు. నిజానికి ఈ లిరిక్స్ రాసిన వారిని కూడా మెచ్చుకోవాల్సిందే. అంతేకాకుండా ముఖ్యంగా ఉపేంద్ర ధైర్యాన్ని, ఆయన గట్స్ ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే సమాజంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిపై ప్రశ్నించాలని, సినిమాలు తీయాలి అని ఎంతో మంది డైరెక్టర్స్ కి ఉండచ్చు.

సమాజాన్ని ప్రశ్నించే సినిమాలు తీస్తే.. ఈ సమాజం యాక్సెప్ట్ చేయదేమో అనే భయంతో ఆగిపోతారు. లేదంటే అలాంటి మూవీస్ చేస్తే ఎక్కడ ఇంకొకరికి టార్గెట్ అవుతారేమో అనే భయం కూడా ఉండచ్చు. కానీ, ఉపేంద్ర మాత్రం అలాంటివి ఏవీ పట్టించుకోడు. తాను అనుకున్నది తీసేస్తాడు. చెప్పాలి అనుకున్నది చెప్తాడు. ప్రశ్నించాలి అనుకుంటే ప్రశ్నిస్తాడు. ఇప్పుడు ఈ యూఐ సినిమాలో కూడా అదే చేశాడు.  ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. మొత్తం 9 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సోషల్ మీడియా పేరుతో ప్రజలు చేస్తున్న వింత పనులు, చూపిస్తున్న పైత్యాన్ని ముక్కు సూటిగా ప్రశ్నించాడు. సెలబ్రిటీలు అంటే ట్రోలింగ్ సహజమే అటూనే సెటైర్లు వేసేశాడు. మరి.. ఉపేంద్ర ట్రోల్స్ వీడియో సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.