iDreamPost
android-app
ios-app

ఉపేంద్ర UI నుంచి మెంటల్ మాస్ సాంగ్! ఇలాంటి పాట చాలా రోజుల తరువాత!

  • Published Feb 14, 2024 | 12:28 PM Updated Updated Feb 14, 2024 | 12:36 PM

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన చిత్రం ‘యూఐ’. ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఊర మాస్ సాంగ్ బయటకు వచ్చింది. ఇదిప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన చిత్రం ‘యూఐ’. ఈ మూవీ నుంచి తాజాగా ఓ ఊర మాస్ సాంగ్ బయటకు వచ్చింది. ఇదిప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

  • Published Feb 14, 2024 | 12:28 PMUpdated Feb 14, 2024 | 12:36 PM
ఉపేంద్ర UI నుంచి మెంటల్ మాస్ సాంగ్! ఇలాంటి పాట చాలా రోజుల తరువాత!

ఉపేంద్ర.. ఈ కన్నడ సూపర్ స్టార్ పేరు వింటేనే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. ఎన్నడూ చూడని, వినని డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్​తో వసూళ్ల జాతర చేయడం ఉప్పీకి అలవాటుగా మారింది. వైవిధ్యమైన చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారాయన. ఒక యాక్టర్​గా ఎంత ఫేమసో.. డైరెక్టర్​గా ఉప్పీ అంత కంటే ఫేమస్. ‘ఉపేంద్ర’, ‘ఏ’ లాంటి పలు సినిమాలతో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడతో పాటు తెలుగులోనూ ఆయన మూవీస్​కు మంచి డిమాండ్ ఉంది. అలాంటి ఉప్పి మరోమారు మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన సినిమా ‘యూఐ’. చిన్న గ్లింప్స్​తో టాక్ ఆఫ్​ ది టౌన్​గా మారిన ఈ ఫిల్మ్ నుంచి తాజాగా ఒక మెంటల్ మాస్ సాంగ్ బయటకు వచ్చింది.

‘చీప్ సాంగ్’ పేరుతో సాగే ఈ పాటలోని లిరిక్స్ వింటే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఎప్పుడూ వినని లిరిక్స్​తో ఈ పాటను తనదైన శైలిలో డిజైన్ చేయించారు ఉపేంద్ర. ‘చీప్ చీప్.. అంతా చీప్ చీప్’ అంటూ మనుషుల బిహేవియర్​ను టార్గెట్ చేస్తూ ఆయన ఈ పాటను కంపోజ్ చేయించినట్లు కనిపిస్తోంది. లిరిక్స్​కు తగ్గట్లే సాంగ్​లో డిఫరెంట్ లుక్​లో దర్శనమిచ్చారు ఉప్పీ. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రిలీజ్​కు ముందే ఇంత సంచలనంగా మారిన ‘యూఐ’ విడుదల తర్వాత ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందోనని అంతా అనుకుంటున్నారు. ఇక, ‘యూఐ’లో ఉపేంద్రతో పాటు సన్నీ లియోన్, మురళీ శర్మ, నిధి సుబ్బయ్య, ఇంద్రజీత్ లంకేష్, మురళీ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి.. ‘చీప్ సాంగ్’ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş