iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ నుండి ఓ అప్డేట్! థాంక్స్ శంకర్ అన్న!

  • Published Mar 05, 2024 | 6:09 PM Updated Updated Mar 05, 2024 | 6:09 PM

అప్పుడెప్పుడో సినిమా ఎనౌన్స్ మెంట్. ఆ తర్వాత పోస్టర్, టైటిల్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. అంతలో ఓ పాట లీక్. అదిగో అది రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించి.. వెంటనే తూచ్ అన్నారు. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది.

అప్పుడెప్పుడో సినిమా ఎనౌన్స్ మెంట్. ఆ తర్వాత పోస్టర్, టైటిల్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారంటే.. ఆ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. అంతలో ఓ పాట లీక్. అదిగో అది రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించి.. వెంటనే తూచ్ అన్నారు. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది.

  • Published Mar 05, 2024 | 6:09 PMUpdated Mar 05, 2024 | 6:09 PM
ఎట్టకేలకు గేమ్ ఛేంజర్ నుండి ఓ అప్డేట్!  థాంక్స్ శంకర్ అన్న!

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ .. మోస్ట్ యాంగ్జైటెడ్ మూవీగా మారిపోయింది. సినిమా షూటింగ్ మొదలై రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు. చరణ్ 15వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో..కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, జయరాం, నాజర్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దీనికి కథ అందించడం విశేషం. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్ డేట్స్ కూడా సరిగ్గా నోచుకోదు.

శంకర్ ఈ చిత్రంతో పాటు కమల్ భారతీయుడు 2ను కూడా డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మరింత ఆలస్యం అవుతుంది. దీంతో ఫుల్ బాధలో ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. అలాగే శంకర్ పై కూడా గుర్రుగా ఉంటున్నారు. అన్నా ఎప్పుడు అప్ డేట్ ఇస్తావంటూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. అప్పుడెప్పుడో పోస్టర్,  చెర్రీ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారంతే. అయితే ఈ యాంగ్జైటీకి తగ్గట్టుగా కొంత మంది లీకు వీరులు.. కొన్ని ఫోటోలు.. ఓ పాటను లీక్ చేసేశారు. అదే జరగండి జరగండి సాంగ్. అప్పట్లో అదే మహా ప్రసాదంగా భావించారు చరణ్ అభిమానులు. ఎలాగో లీక్ అయిపోయింది కదా.. అని దీపావళి పండుగ సందర్బంగా విడుదల చేస్తామంటూ ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో ఆ పాట కోసం ఎంతగానో ఎదురు చూశారు. అంతలో వారి ఆశలను అడియాశలు చేస్తూ..అప్పట్లో కూడా తూచ్ అని ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ.

ఆడియో డాక్యుమెంటేషన్ ఇష్యూస్ వచ్చాయని, ప్రస్తుతానికి వాయిదా వేసి త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని పేర్కొంది. ఈ సినిమా గురించి ఇప్పుడో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ జరగండి సాంగ్.. రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ జన్మదినం పురస్కరించుకుని.. ఆ రోజు అతడి ఫ్యాన్స్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైందట చిత్ర యూనిట్. ఈ లీక్ సాంగ్ ఆ రోజే విడుల చేయాలని యోచనలో ఉన్నారట. అయితే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఎట్టకేలకు ఓ అప్డేట్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. శంకర్ అన్న థాంక్యూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇప్పుడైనా ఈ పాట విడుదలయ్యేనా.. అభిమానులకు మోక్షం దక్కేనా.. వెయిట్ అండ్ సీ..

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio