iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు దసరా ట్రీట్.. వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి

  • Published Sep 23, 2024 | 6:02 PM Updated Updated Sep 23, 2024 | 6:02 PM

2024 Dussehra Movie Updates: సినిమా అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ దసరా కు ఫ్యాన్స్ కు వరుస అప్డేట్స్ రానున్నాయి. అవేంటో చూసేద్దాం.

2024 Dussehra Movie Updates: సినిమా అంటే తెలుగు వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ దసరా కు ఫ్యాన్స్ కు వరుస అప్డేట్స్ రానున్నాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Sep 23, 2024 | 6:02 PMUpdated Sep 23, 2024 | 6:02 PM
ఫ్యాన్స్ కు  దసరా ట్రీట్.. వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి

ప్రేక్షకులకు సినిమా అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. పేరుకి పలానా హీరో ఫ్యాన్ అని చెప్పుకున్నా కూడా.. దాదాపు అందరూ అన్ని హీరోల సినిమాలను కవర్ చేస్తూనే ఉంటారు. దీనితో ఎప్పుడెప్పుడు మూవీస్ కు సంబంధించిన అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రత్యేకించి తమ హీరోకు సంబంధించిన అప్డేట్ వచ్చిందంటే.. అది వారికి పండగే. ఇక అలానే మేకర్స్ కూడా అభిమానులకు తగినట్లు సరిగ్గా పండగల సమయంలో.. సరైన అప్డేట్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిలో ఇప్పటికే సంక్రాంతి అంటేనే సినిమాలా పండుగగా అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమాలా సందడి అయిపోయింది. సంక్రాంతి తర్వాత పెద్ద పండగ అంటే దసరానే. మరి దసరాకు ఎలాంటి అప్డేట్స్ రానున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ప్రతి పండుగకు మూవీ మేకర్స్.. కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. థియేటర్స్ కు కొత్త సినిమాలతో వచ్చే వారు కొందరైతే.. రాబోయే సినిమాల గురించి అప్డేట్స్ ఇచ్చే వారు మరికొందరు. అది మూవీ ఓపెనింగ్ గురించి కావొచ్చు.. ఏదైనా స్టిల్ , గ్లిమ్ప్స్ , టైటిల్ , టీజర్ ఇలా ఏదైనా కావొచ్చు. ఫ్యాన్స్ కు మాత్రం ఎదో ఒక ట్రీట్ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న సినిమాలను తీసుకుంటే.. చిరంజీవి విశ్వంభర నుంచి ఇప్పటివరకు టైటిల్ అనౌన్సమెంట్ వీడియో , త్రిష సెట్స్ పైకి ఎంట్రీ ఇచ్చిన వీడియో తప్ప మరొకటి లేదు . అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ఎలాగూ చివరి దశకు చేరుకుంది. కాబట్టి ఈ మూవీ నుంచి దసరాకు గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక బాలకృష్ణ- బాబీ మూవీ టైటిల్ ను ప్రకటిస్తారని సమాచారం. అలాగే సంక్రాంతి బరిలో దిగే సినిమాల ప్రమోషన్స్ దసరాతో మొదలవ్వనున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు.. వెంకటేష్- అనిల్ రావిపూడి మూవీ , అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రిలీజ్ కానున్నాయి.

వెంకీ- అనిల్ రావిపూడి మూవీ .. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ వినిపిస్తుంది. దసరాకు దాదాపు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తారు. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి గ్లిమ్ప్స్ కానీ , టీజర్ కానీ రిలీజ్ కానుంది. సంక్రాంతికి బరిలో ఉన్న బాలకృష్ణ , వెంకటేష్ లు ఆల్రెడీ సెట్స్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . విజయ్ దేవర కొండ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇక డిసెంబర్ లో రిలీజ్ కు రెడీగా ఉన్న పుష్ప-2 , తండేల్ , గేమ్ ఛేంజర్ సినిమాల నుంచి ఎదో ఒక అప్డేట్ రావడం గ్యారెంటీ. మరి ఈసారి దసరాకు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. ఫ్యాన్స్ కు ఎలాంటి ట్రీట్ ఇస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio