iDreamPost
android-app
ios-app

బాబాయ్ ‘అన్ స్టాపబుల్’కు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా?

  • Published Dec 17, 2022 | 11:53 AM Updated Updated Dec 17, 2022 | 11:53 AM
  • Published Dec 17, 2022 | 11:53 AMUpdated Dec 17, 2022 | 11:53 AM
బాబాయ్ ‘అన్ స్టాపబుల్’కు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా పరిచయమైన షో ‘అన్ స్టాపబుల్’. ఆహాలో ప్రసారమవుతున్న ఈ షో మొదటి సీజన్ ఊహించని సక్సెస్ సాధించడంతో.. రెండో సీజన్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మొదటి సీజన్ తో పోల్చితే ఈ సీజన్ డల్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో.. ప్రభాస్ ఎపిసోడ్ ప్రకటనతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. గోపీచంద్ తో కలిసి ప్రభాస్ పాల్గొన్న ఈ ఎపిసోడ్ ఇప్పటికే షూట్ పూర్తి కాగా, డిసెంబర్ చివరిలో ప్రసారమయ్యే అవకాశముంది. ఇక ఈ షోలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడని, త్వరలోనే షూట్ జరగనుందని సమాచారం. అయితే అన్ స్టాపబుల్ రెండో సీజన్ లో ప్రభాస్, పవన్ సందడి చేయనున్న నేపథ్యంలో.. ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటాడా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పలు సందర్భాల్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి వేదిక పంచుకున్నప్పటికీ.. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనేది తరచూ వినిపించే మాట. అయితే ఈమధ్య కాలంలో వారిద్దరూ కలిసి వేదిక పంచుకున్నది కూడా లేదు. దానికితోడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలో జూనియర్ స్పందన సరిగా లేదంటూ కొందరు టీడీపీ శ్రేణులు, బాలయ్య అభిమానులు ఆయనను దారుణంగా విమర్శించారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం అదేస్థాయిలో వారిపై ఎదురుదాడికి దిగారు. అయితే అటు బాలకృష్ణ, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ అభిమానించే నందమూరి ఫ్యాన్స్ మాత్రం.. బాబాయ్-అబ్బాయ్ సరదాగా మాట్లాడుకోవడం చూడాలనుకుంటున్నారు. అందుకే బాలయ్య అన్ స్టాపబుల్ కి తారక్ ఎప్పుడు వస్తాడు అని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు.

‘అన్ స్టాపబుల్’ మొదటి సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు సందడి చేయగా.. రెండో సీజన్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ సందడి చేయనున్నారు. బాలయ్య షోకి ఇలా స్టార్స్ అందరినీ తీసుకొస్తున్నారు కానీ సొంత ఫ్యామిలీకి చెందిన స్టార్ తారక్ ని ఎందుకు తీసుకురావడం లేదని నందమూరి అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి బాధని అర్థం చేసుకున్న షో నిర్వాహకులు.. ఈ సీజన్ లో జూనియర్ ని కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఈ షోలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాబాయ్ అబ్బాయిల ఎపిసోడ్ ని ప్రత్యేకంగా నిలిచేలా చేయనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ యూఎస్ లో ఉన్నాడు. ఇండియా రావడానికి కనీసం రెండు మూడు వారాలు పడుతుంది. మరి వచ్చాక ఈ షోలో పాల్గొంటాడేమో చూడాలి.

మొదటి సీజన్ లో మాదిరిగానే రెండో సీజన్ లో కూడా పది ఎపిసోడ్లు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు ప్రసారమయ్యాయి. ప్రభాస్, పవన్ ఎపిసోడ్లు కూడా కలిపితే ఏడు అవుతాయి. మరి మిగతా ఆ మూడు ఎపిసోడ్లలో ఎన్టీఆర్ ఎపిసోడ్ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom