iDreamPost
android-app
ios-app

వాసంతి- పవన్ కల్యాణ్ పై ట్రోల్స్.. ఇంటర్వ్యూలో ఇలా చేస్తారా అంటూ..

  • Published Feb 19, 2024 | 6:06 PM Updated Updated Feb 19, 2024 | 6:32 PM

Vasanthi Krishnani- Pawan Kalyan: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి వాసంతి కృష్ణన్ పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలో చేసిన పనికి నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.

Vasanthi Krishnani- Pawan Kalyan: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర నటి వాసంతి కృష్ణన్ పై నెట్టింట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇంటర్వ్యూలో చేసిన పనికి నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.

  • Published Feb 19, 2024 | 6:06 PMUpdated Feb 19, 2024 | 6:32 PM
వాసంతి- పవన్ కల్యాణ్ పై ట్రోల్స్.. ఇంటర్వ్యూలో ఇలా చేస్తారా అంటూ..

సాధారణంగా ఇంటర్వ్యూ ఉంటే ఒక గెస్ట్ ని పిలిచి వారికి సంబంధించిన వ్యక్తిగత, కెరీర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను అడిగి సమాధానాలు రాబడతారు. ఇప్పుడు కాస్త ట్రెండ్ మారిందనే చెప్పాలి. ఎందుకంటే చూసే వారికి, వచ్చిన అతిథులకు ఆసక్తి కలిగించేలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయడం, కేకులు కట్ చేయించడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ, ఈసారి ఓ ఇంటర్వ్యూలో అంతకు మించే జరిగింది. అలా జరగడంతో అది కాస్తా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథులు కూడా నెటిజన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. అయితే ఆ అతిథులు మరెవరో కాదు.. బుల్లితెర నటి వాసంతి కృష్ణన్ అమెకు కాబోయో భర్త పవన్ కల్యాణ్.

వాసంతి కృష్ణన్ కు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో సీరియల్స్ చేసి చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో కూడా అమ్మడుకి చాలా మందే ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవలే పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. తాజాగా వీళ్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జంటగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలు అంటే మాటా మంతి ఉంటే బాగానే ఉండేది. కానీ, ఇందులో మాత్రం అంతకు మించి ఉండటంతో నెటిజన్స్ నుంచి వ్యతిరేకత రావడమే కాకుండా.. ట్రోలింగ్ కు కూడా గురవుతున్నారు.

వాసంతి కృష్ణన్ కు పవన్ కల్యాణ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరు జంటగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ తీసుకుంది ప్రేమికుల దినోత్సవం కోసం కాబట్టి కాస్త గట్టిగానే ప్లాన్ చేశారు. ముందుగా ఇద్దరితో కేక్ కట్ చేయించి ఇంటర్వ్యూని ప్రారంభించారు. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు కామెంట్స్ చేయడం, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను కెమెరాల సమక్షయంలో వెల్లిబుచ్చడం చేశారు. బొకేలు ఇచ్చి ప్రపోజ్ చేయడం, హగ్గులు ఇచ్చుకుని ఐ లవ్ యూ చెప్పుకోవాడన్ని కూడా ఎవరూ తప్పుబట్టడం లేదు.

కానీ, ఈ ఇంటర్వ్యూలో ఓ గేమ్ కండక్ట్ చేశారు. అదేంటంటే.. ఒకరికి ఒకరు ద్రాక్షపళ్లు తినిపించుకోవడం. అయితే చాలా సింపుల్ గా చేతితో తినిపించుకుంటే కిక్ ఉండదు కాబట్టి.. చేతులతో తాకకుండా ఒకరికి ఒకరు ద్రాక్ష పళ్లు తినిపించుకోవాలి. నేను గెలవాలంటే నేను గెలవాలి అంటూ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడారు. ఈ గేమ్ కాస్తా చూడటానికి వాళ్లిద్దరు ఏదో సరసాలు ఆడుతున్నట్లు కనిపించింది. ఈ టాస్క్ చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ఇంటర్వ్యూలు రేంజ్ మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వ్యూకి పిలిస్తే ప్రశ్నలు అడగాలి.. సమాధానాలు చెప్పించాలి.. ఇలా సరసాలు ఆడిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్లు గేమ్ పెట్టారనుకో వెళ్లిన వాళ్లకు బుద్ధి ఉండక్కర్లేదా అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş