iDreamPost
android-app
ios-app

చిరంజీవితో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్..?

  • Author ajaykrishna Updated - 11:40 AM, Wed - 4 October 23
  • Author ajaykrishna Updated - 11:40 AM, Wed - 4 October 23
చిరంజీవితో త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ సీక్వెల్..?

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి టైమ్ రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది. అనుకుంటే మధ్యలో కూడా అవుతుందేమో గానీ.. ఇన్నాళ్లు వీరి కాంబినేషన్ గురించి ఎవరు పెద్దగా ఆలోచించలేదని అనుకుంటారు. కానీ.. ఒకసారి తెరపైకి టాక్ వస్తే.. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి ఉత్సాహాన్ని తెచ్చింది మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్. అవును.. ఈ కాంబోలో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో అయితే రాలేదు. కానీ.. చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాకు రచయితగా వర్క్ చేశాడు త్రివిక్రమ్.

ఆ తర్వాత ఇన్నేళ్ల వరకు వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా ప్రస్తావనకు రాలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు త్రివిక్రమ్ చిరు కోసం ఓ క్లాసిక్ మూవీ సీక్వెల్ స్టోరీ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని టాక్. ఆ సినిమా ఏదో కాదు.. మెగాస్టార్ కి నటుడిగా ఎనలేని గుర్తింపుతో పాటు మాస్ ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టిన ఖైదీ. 1983లో విడుదలైన ఆ సినిమా.. చిరు కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు. ఖైదీ క్లైమాక్స్ లో.. ‘పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మ ఎత్తాను. ప్రేమ కోసం మరోజన్మ ఎత్తుతాను. అప్పుడు కలుసుకుందాం’ అనే డైలాగ్ తో సినిమా పూర్తి అవుతుంది.

ఇప్పుడదే లైన్ తో త్రివిక్రమ్ సీక్వెల్ స్టోరీ రాస్తున్నాడని సినీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే.. త్రివిక్రమ్, చిరు కాంబినేషన్ లో సినిమా రావాలి అనేది ఇప్పటి ఆలోచన కాదు. ఎన్నాళ్ళుగానో వీరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని అనుకుంటూనే ఉన్నారు జనాలు. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని టాక్ ఉంది. ఎందుకంటే.. త్రివిక్రమ్ ప్రెజెంట్ గుంటూరు కారం మూవీ చేస్తూ.. తదుపరి సినిమాని అల్లు అర్జున్ తో ఫిక్స్ చేసుకున్నాడు. మరోవైపు మెగాస్టార్.. బింబిసార ఫేమ్ వశిష్ఠతో ఓ సినిమా, కళ్యాణ్ కృష్ణతో ఇంకో సినిమా లైనప్ చేశాడు. సో.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో మెగాస్టార్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం. మరి ఈ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş