iDreamPost
android-app
ios-app

విజయ్ దేవరకొండ సాయం.. రెండేళ్ల తర్వాత ట్రాన్స్ జెండర్ థ్యాంక్స్!

Transgender thanks to Vijay Devarakonda: విజయ్ చేసిన సాయం గురించి చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు ఓ ట్రాన్స్ జెండర్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

Transgender thanks to Vijay Devarakonda: విజయ్ చేసిన సాయం గురించి చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు ఓ ట్రాన్స్ జెండర్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

విజయ్ దేవరకొండ సాయం.. రెండేళ్ల తర్వాత ట్రాన్స్ జెండర్ థ్యాంక్స్!

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ లో ఈ రౌడీ హీరోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మూవీల్లో విజయ్ చూపించే అటిట్యూబ్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరీ ముఖ్యంగా విజయ్ కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. అతడంటే పడి చస్తారు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. సాయం విషయంలో మాత్రం విజయ్ ది గొప్ప మనసు. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. ఇబ్బందుల్లో ఉన్న ఫ్యాన్స్, ప్రజలకు హెల్ప్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన సాయం గురించి చెబుతూ.. ఎమోషనల్ అయ్యారు ఓ ట్రాన్స్ జెండర్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే?

విజయ్ దేవరకొండ ఇటీవలే ఇండియన్ ఐడల్ సీజన్2 షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో ఆ స్టేజ్ పై ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ట్రాన్స్ జెండర్ విజయ్ చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. “నేనొక ట్రాన్స్ జెండర్ ని సార్. గత రెండు సంవత్సరాలుగా మీకు థ్యాంక్స్ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. మాకు బెగ్గింగే జీవనాధారం. అయితే కరోనా కాలంలో అందరం ఇంటికే పరిమితం అయ్యాం. ఆ టైమ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ టైమ్ లో గూగుల్ లో విజయ్ ఫౌండేషన్ అని కనిపించింది. దానిపై క్లిక్ చేసి సాయం కావాలని ఫామ్ ను ఫిల్ చేశాను. ఇది చేసిన 16 నిమిషాల్లోనే నాకు ఫౌండేషన్ నుంచి ఫోన్ వచ్చింది. నాకే కాదు.. ఇలా 18 మంది ట్రాన్స్ జెండర్స్ కు మీరు సాయం చేశారు. దాంతో నాకు అప్పుడు అనిపించింది.. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు” అంటూ సదరు ట్రాన్స్ జెండర్ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనికి విజయ్ కూడా స్పందిస్తూ.. “ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది రూ. 500, రూ. 1000 రూపాయాలు సాయం చేశారు. వారందరి వల్లే నేను ఇలా హెల్ప్ చేయగలుగుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఖుషి మూవీ టైమ్ లో కూడా 100 మంది పేద అభిమానుల కుటుంబాలకు తలా ఒక లక్షచొప్పున సాయం చేశాడు విజయ్. తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్న విజయ్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి