iDreamPost
android-app
ios-app

Polimera 3: యుద్ధం మెుదలు పెట్టిన సత్యం రాజేష్! పొలిమేర -3 ఈసారి పాన్ ఇండియా..

  • Published Jul 10, 2024 | 12:21 PM Updated Updated Jul 10, 2024 | 12:21 PM

సత్యం రాజేష్ మరోసారి యుద్ధం మెుదలుపెట్టాడు. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 తర్వాత ఈ ఫ్రాంచైజీలోనే పొలిమేర 3 వస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సత్యం రాజేష్ మరోసారి యుద్ధం మెుదలుపెట్టాడు. మా ఊరి పొలిమేర, పొలిమేర 2 తర్వాత ఈ ఫ్రాంచైజీలోనే పొలిమేర 3 వస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Published Jul 10, 2024 | 12:21 PMUpdated Jul 10, 2024 | 12:21 PM
Polimera 3: యుద్ధం మెుదలు పెట్టిన సత్యం రాజేష్! పొలిమేర -3 ఈసారి పాన్ ఇండియా..

హర్రర్ కామెడీ చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద పీట వేస్తూనే ఉంటారు. ఇక ఇలాంటి చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. తమిళం నుంచి చంద్రముఖి, కాంచనా సినిమాలు వచ్చినప్పటికీ.. హార్రర్ సినిమాలకు కామెడీ టచ్ ఇచ్చింది మాత్రం తెలుగు పరిశ్రమనే చెప్పాలి. సుధీర్ బాబు ‘ప్రేమకథా చిత్రం’ నుంచి మెున్నటి మసూద వరకు ఎన్నో హార్రర్ మూవీస్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఓటీటీలో వచ్చి.. పెను సంచలనం సృష్టించింది ‘మా ఊరి పొలిమేర’. ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయిన పొలిమేర 2 కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు పొలిమేర 3 లోడింగ్ అవుతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

‘మా ఊరి పొలిమేర’.. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన చిత్రం. చిన్న చిత్రంగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. దాంతో ఇదే టీమ్ తో దానికి సీక్వెల్ గా వచ్చిన పొలిమేర 2 మూవీని థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లింది. పైగా భారీ వసూళ్లను కూడా సాధించింది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో పార్ట్ 3ని కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈసారి మరింత పాన్ ఇండియా రేంజ్ లో పార్ట్ 3 వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ పొలిమేర 3కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కూడా సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జోడీగా నటిస్తున్నారు. స్క్రీప్ట్ వర్క్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని డైరెక్టర్ తెలిపాడు. తాజాగా టీజర్ ను కూడా విడుదల చేశారు. టీజర్ లో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్? అని అడగటం.. సత్యం రాజేష్ యుద్ధం చేస్తున్నాను అని సమాధానం చెప్పడంతో సినిమాపై మరోసారి హైప్ ను క్రియేట్ చేశాడు డైరెక్టర్. పొలిమేర 3ని పాన్ ఇండియా హార్రర్ మూవీగా తీసుకురాబోతున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. మరి పొలిమేర 3 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş