iDreamPost
android-app
ios-app

నాన్నతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఈ అమ్మడికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంది

  • Published Jul 15, 2024 | 12:47 PM Updated Updated Jul 15, 2024 | 12:47 PM

Pic Talk: పై ఫోటోలో తండ్రితో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో తండ్రితో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..?

  • Published Jul 15, 2024 | 12:47 PMUpdated Jul 15, 2024 | 12:47 PM
నాన్నతో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఈ అమ్మడికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంది

సినీ ఇండస్ట్రీలో తరుచు చాలామంది నటీ, నటులు గురించి మాట్లాడుకుంటు ఉంటాం. ముఖ్యంగా వారి అందం, యాక్టింగ్, బిహెవియర్ గురించి కథలు కథలుగా చర్చించుకుంటాం. అయితే కొంతమంది యాక్టర్స్ కోసం ఎంత చెప్పుకొని మాట్లాడుకున్నా తరిమితీరదు. అసలు బోర్ కూడా అనిపించదు. ఎంతైనా వారి కోసం వినాలి, మాట్లాడుకోవాలి అనిపిస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాని నటి, నటుల పేర్లు, ఫోటోస్ కనిపించిస్తే చాలు వారిలో ఏదో తెలియని ఆనందం. మరి ఆ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి అందరూ మెచ్చిన, నచ్చిన, ఆరాధించిన ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట హాల్ చల్ చేస్తుంది. మరి, ఇంతకి పై ఫోటోలో తండ్రితో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. ముఖ్యంగా దక్షిణాదిలోని క్రేజీ హీరోయిన్. ఈమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అయితే ఈమెను గుర్తుపట్టాడం కాస్త కష్టంగానే ఉండవచ్చు. అందుకోసం ఓ చిన్న క్లూ ఇస్తున్నాం. ఈమె ఇండస్ట్రీలో ఓ మల్టిటాలెంటెడ్ హీరోయిన్. ముఖ్యంగా ఈమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆమె ఎవరో కనిపెట్టే ఉంటారు. ఆమె డాక్టర్ కమ్ యాక్టర్ ‘సాయి పల్లవి’. ఈమె గురించి తెలియని ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. అంతలా తన నటనతో, డ్యాన్స్ తో, యాటిట్యూడ్ తో లక్షాలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.ఇకపోతే ఈమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే.. ఎక్కడ కూడా గ్లామర్ షో చేసే పాత్రలు చేయకుండా.. తాను ఒదిగిన పాత్రలనే ఎంచుకంటూ తన న్యాచురల్ నటనతో మంచి విజయాలను అందుకుంది సాయి పల్లవి. ఇలా అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకటిరిగా నిలిచింది ఈ అమ్మడు. అంతేకాకుండా.. ఈమెకు లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఉంది. కాగా, ఈ మధ్యనే ఈ బ్యూటీ తన వైద్య చదవులో గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని డాక్టర్ సాయి పల్లవిగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సాయి పల్లవి తన తండ్రి 60వ బర్త్ డే సందర్భంగా కొన్ని క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. అందులో సాయి పల్లవిని చిన్నప్పుడు తన తండ్రి ఎత్తుకునే ఫోటో కూడా ఒకటి ఉంది. ఇక ఈ ఫోటోస్ ను షేర్ చేసిన సాయి పల్లవి.. ’60వ పుట్టిన రోజు శుభాకాంక్షలు నాన్న. మాకు ఇంతటి ప్రశాంతమైన జీవితం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీ జీన్స్ నుంచి ఫుట్ బాల్ ఆడటానికి బలమైన కాళ్లు ఇచ్చినందుకు థ్యాంక్యూ. చాలా సెన్సిటివ్ గా ఉండే మమ్మల్ని ఇంత స్ట్రాంగ్ గా మార్చినందుకు, నాకు, పూజాకు స్ఫూర్తిని ఇచ్చినందుకు థ్యాంక్యూ ‘ అని రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటోస్ ను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ ఆమెను గుర్తుపట్టాడం కాస్త కష్టంగానే అనిపించింది. ఎందుకంటే.. ఇప్పుడు సాయి పల్లవికి, చిన్నప్పుడు ఫోటోకు చాలా తేడా ఉంది. అయిన సరే సాయి పల్లవి చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉందంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయి పల్లవి చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet