Krishna Kowshik
ఈ ఫోటోలో కనిపిస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా..? టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులయితే ఆమెను మర్చిపోలేరు. ఎందుకంటే..?
ఈ ఫోటోలో కనిపిస్తోన్న చిన్నారిని గుర్తుపట్టారా..? టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులయితే ఆమెను మర్చిపోలేరు. ఎందుకంటే..?
Krishna Kowshik
సౌత్ ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్ భామలు హవా సాగించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా మంది ముద్దుగుమ్మలు ఇక్కడ హీరోలతో చిందులేసి.. తిరిగి బీటౌన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించే వారు కాదు. కానీ ఇప్పుడు హీరోయిన్లు బ్రతక నేర్చిన వారు. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల్లోనూ వర్క్ చేస్తున్నారు. రెండు పడవలపై కాలు వేసి సక్సెస్ కొట్టిన నటీమణులు ఉన్నారు. హిందీ ఇండస్ట్రీతో పోల్చుకుంటే.. రెమ్యునరేషన్ తక్కువైనప్పటికీ దక్షిణాది సినీ పరిశ్రమ నుండి వస్తున్న అవకాశాలను వదులుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో పలు ఇండస్ట్రీలో కాల్షీట్లు క్లాషెస్ అవ్వకుండా సినీ ప్రయాణాన్ని నెట్టుకొస్తున్న స్టార్ హీరోయిన్లున్నారు
ఆ కోవలోకే వస్తుంది ఇదిగో మీరు చూస్తున్న ఈ చిన్నారి కూడా. ఈ పిక్ లో కూర్చుని, తన సోదరుడితో కలిసి ఆడుకుంటున్న ఈ పాపను గుర్తు పట్టారా..? తెలుగు, తమిళ ఇండస్ట్రీని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా తెలుగు జనాలకు బాగా పరిచయస్థురాలు. ఆమెకు స్టార్ డమ్ ఇచ్చిందే ఇక్కడి ప్రేక్షకులు. అందుకే తెలుగు గడ్డకు, ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇటీవల తెలుగులో కాస్త సినిమాలు తగ్గించినా.. మళ్లీ మంచి ఛాన్స్ వస్తే అస్సలు వెనకాడదు. ఇంతకు ఆ పాప ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్. పంజాబీ ఫ్యామిలీకి పుట్టిన ఈ ఢిల్లీ గుడియా 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. 19 ఏళ్లకే కన్నడ చిత్రం గిల్ 9 (7/G బృందావన్ కాలనీ) రీమేక్ చిత్రంతో ఎంటర్ అయ్యింది.
2011లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఆమె.. మిస్ ప్రెస్ ఫేస్, మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్ సబ్ టైటిల్స్ గెలుచుకుంది. 2011లో వచ్చిన బైలింగ్వల్ మూవీ కెరటంతో తెలుగు, తమిళంలో ఒక్కేసారి కాలు మోపిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో హిట్ అందుకుంది. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ తన నటనతో మెస్మరైజ్ చేయడంతో టాలీవుడ్ నాట అవకాశాలు క్యూ కట్టాయి. తమిళ్, హిందీలో అడపాదడపా సినిమాలు చేస్తూ.. తెలుగులో మాత్రం వరుస పెట్టి ప్రాజెక్టులు చేసింది. రఫ్,లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్ 2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, స్పైడర్, మన్మధుడు 2, చెక్, కొండ పొలం వంటి చిత్రాలు చేసింది ఈ బ్యూటీ.
హిందీలో అడపాదడపా చేస్తూనే.. ఈ సారి సీరియస్‌గా తీసుకుంది. 2021 తర్వాత హిందీలో ఎటాక్, రన్ వే 34, డాక్టర్ జీ, థాంక్ గాడ్, చత్రీవాలీ వంటి చిత్రాలు చేసింది. చత్రీవాలీ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ ఏడాది తమిళంలో ఓ మూవీతో పలకరించింది ఈ బ్యూటీ. శివకార్తీకేయన్ హీరోగా నటించిన అయలాన్ పిక్చర్‌లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇండియన్ 2తో పాటు ఓ హిందీ మూవీ చేస్తోంది. ఈ ఏడాది రకుల్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత కమ్ నటుడు జాకీ భగ్నానీని ఫిబ్రవరిలో వివాహం చేసుకుని న్యూ లైఫ్ లీడ్ చేస్తోంది. గతంలోనే వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ఈ నటి.. దాని ద్వారా కూడా కోట్లు సంపాదిస్తోంది