iDreamPost
android-app
ios-app

Divorce: బుల్లి తెర జంట విడాకులంటూ వార్తలు.. నటి క్లారిటీ

  • Published Dec 23, 2023 | 3:55 PM Updated Updated Dec 23, 2023 | 3:55 PM

టాలీవుడ్ బుల్లితెర జంట విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై తాజాగా నటి స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

టాలీవుడ్ బుల్లితెర జంట విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై తాజాగా నటి స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Dec 23, 2023 | 3:55 PMUpdated Dec 23, 2023 | 3:55 PM
Divorce: బుల్లి తెర జంట విడాకులంటూ వార్తలు.. నటి క్లారిటీ

ఓ పాతికేళ్ల క్రితం విడాకులు అనే మాట వినపడితే.. అదేదో వినకూడని మాట అన్నట్లుగా భావించేవారు. సెలబ్రిటీల సంగతి అలా ఉంచితే సామాన్యులు విడాకులు అనే మాటను అసలు రానిచ్చేవారు కాదు. కానీ నేటి కాలంలో విడాకులు అనేవి సర్వసాధారణం అయ్యాయి. నచ్చితే కలిసి ఉండాలి.. లేదంటే విడిపోవాలి ఇదే ఆలోచనలో ఉన్నారు చాలా మంది. ఇక సెలబ్రిటీల విషయంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేది కామన్ అయ్యింది. ఇక వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి రూమర్లు ఒక రేంజ్లో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో టాలీవుడ్ బుల్లితెర జంట విడాకులు తీసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది నటి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

బుల్లితెర సెలబ్రిటీ జంట మానస-ప్రియతమ్ చరణ్‌ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రియతమ్ చరణ్ ప్రస్తుతం పాపే మా జీవిన జ్యోతి సీరియల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే వీరిద్దరూ విడిపోతున్నారు, విడాకులు తీసుకుబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు. గతంలో ఎంతో అన్యన్యంగా ఉంటూ.. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లే ఈ జంట.. ఈమధ్య కాలంలో కలిసి కనిపించడం లేదు. పైగా మానస.. ఒక్కత్తే తన ఇద్దరు పిల్లలతో ఉంటూ వీడియోలు చేసుకుంటూ ఉంది. వాటిల్లో ఆమె భర్త ప్రియతమ్ చరణ్‌ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అభిమానులు అనుమానిస్తూ వస్తున్నారు. అంతేకాక విడిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారంట. తాజాగా వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చింది నటి మానస.

సింపతీ కోసం చెప్పట్లేదు..

తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసిన ఓ వీడియోలో మానస మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమని చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన నేను గత నాలుగు నెలలుగా నరకం అనుభవిస్తున్నాను. అయినా సరే యూట్యూబ్‌లో వ్లాగ్స్‌ చేయడం ఆపడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు నేను, నా పిల్లలిద్దరూ బతకడానికున్న ఏకైక ఆధారం ఈ ఛానల్‌ ఒక్కటే. దీని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడటం లేదు. ఇలా చెప్తే మీరేదో నా మీద జాలీ చూపిస్తారని కూడా చెప్పడం లేదు. ఇది నేనేమీ చేతులారా చేసుకోలేదు. బహుశా ఈ విషయంలో మా ఇద్దరి తప్పు ఉండొచ్చు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. మీరు అనుకుంటున్నట్లు మేము విడాకులు తీసుకోలేదు. తీసుకోము కూడా’ అని చెప్పుకొచ్చారు

Actress manasa charan clarify on devorce

త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి..

‘విడాకులు తీసుకోవాలని మేం కోరుకోవడం లేదు. కానీ ప్రస్తుతం మేం ఇద్దరం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కూడా నేను స్టాండ్‌ తీసుకోకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళనగా ఉంది. మాకు కొంచెం టైం ఇవ్వండి.. అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు అతడు తన పని తాను చేసుకుంటున్నాడు. నా పని నేను చేసుకుంటున్నాను. తనను మిస్‌ అవుతున్నాను. అలా అని ఆ బాధతో ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండలేం కదా.. జీవితంలో ముందుకు సాగాల్సిందే. త్వరలో నా లైఫ్ లో జరగబోయే ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటాను’ అని చెప్పుకొచ్చింది మానస.

మానస విషయానికి వస్తే.. మీలో ఎవరు కోటీశ్వరుడు రెండో సీజన్‌కు ఆమె కాస్టింగ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. అలానే ఓంకార్‌ హోస్ట్‌ చేసిన ఛాలెంజ్‌ 3 అనే డ్యాన్స్‌ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. షార్ట్‌ ఫిలింస్‌తో పాటు సీరియల్స్‌, సినిమాల్లోనూ నటించింది. ఆమె భర్త ప్రియతమ్ చరణ్‌ విషయానికి వస్తే.. అతడు అనేక సీరియల్స్‌లో నటించి బుల్లితెరపై మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. పెద్దలను ఒప్పించి 2015 జనవరి 29న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం ఉన్నారు. ప్రియతమ్ ఇన్ స్టా పోస్ట్ కూడా ప్రస్తుతం వైరలవుతోంది..

 

View this post on Instagram

 

A post shared by T P S H Charan Kumar (@tpriyatham)

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetpark girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel