iDreamPost
android-app
ios-app

ప్రతీ పెద్ద సినిమాకి సీక్వెల్.. ఇలా అయితే ఎలా?

  • Author ajaykrishna Updated - 02:32 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 02:32 PM, Thu - 5 October 23
ప్రతీ పెద్ద సినిమాకి సీక్వెల్.. ఇలా అయితే ఎలా?

ఇండస్ట్రీలో సినిమాలకు సీక్వెల్స్ రావడం అనేది ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. ఒకప్పుడు సినిమాకు కొనసాగింపు ఉందని తెలిస్తే ఫుల్ ఎక్సయిట్ అయ్యేవారు. కానీ.. ఇప్పుడు ప్రతీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందని ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ సూపర్ హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అంటే ఓకే.. అదే ఇంకా ఒక్క పార్ట్ కూడా రిలీజ్ అవ్వని సినిమాకు సీక్వెల్ అనగానే కాస్త కంగారు పడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు మేకర్స్. కానీ.. ఆయా సినిమాలకు సీక్వెల్ వైపు వెళ్లేందుకు ఎంతవరకు సత్తా ఉందనేది కూడా పాయింటే కదా!

ఆ విషయం తెలియాలంటే మొదటి భాగం రిలీజ్ అవ్వాల్సిందే. ప్రస్తుతం సీక్వెల్ కి అనౌన్స్ చేసిన సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. ఒక కథను రెండు భాగాలుగా చెప్పడం కమర్షియల్ గాను వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో.. కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. బాహుబలి, కేజీఎఫ్, ఖైదీ – విక్రమ్ సినిమాలు అందుకు మేజర్ ఉదాహరణలు. ఇప్పుడు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప సినిమాకు కూడా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సీక్వెల్ అనేది ట్రెండ్ గా మారిపోయింది. ముందుగా ఒక్క పార్ట్ గానే రాసుకుంటున్నారు. రిలీజ్ టైమ్ కి కనెక్ట్ అవుతుందని అనిపిస్తే.. వెంటనే ఎడిటింగ్ లో మార్పులు చేసి సీక్వెల్ ఉందంటూ ఎండింగ్ లో అనౌన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ఉన్న సినిమాలు కాకుండా కొత్తగా సీక్వెల్ వైపు చాలా సినిమాలు అడుగులు వేస్తున్నాయి. ఆల్రెడీ సీక్వెల్స్ లిస్ట్ లో.. పుష్ప 2 ఉంది. దానికి తోడుగా సలార్.. కల్కి.. ఇప్పుడు కొత్తగా దేవర చేరింది. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకి ఫస్ట్ పార్ట్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అలా.. ఆల్రెడీ మేకింగ్ లో ఉన్న మీడియం రేంజ్ సినిమాలలో.. డీజే టిల్లు 2, గూఢచారి 2, డబుల్ ఇస్మార్ట్, కార్తికేయ 3 లైన్ లో ఉన్నాయి. ఇవేగాక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి, అఖండ, స్కంద లాంటి సినిమాలకు సీక్వెల్స్ ఉన్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది. మరి ఆల్రెడీ హిట్ అయిన వాటికీ సీక్వెల్స్ అంటే ఓకే. కానీ.. రిలీజ్ ముందే సీక్వెల్స్ అనౌన్స్ చేస్తే ఎలా అని అంటున్నారు ఫ్యాన్స్. మరి టాలీవుడ్ సీక్వెల్ మూవీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.