iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి!

  • Published Sep 14, 2023 | 2:05 PM Updated Updated Sep 14, 2023 | 2:05 PM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి!

గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించిన నిర్మాత ముకేశ్ ఉదేశీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త మరువక ముందే 500 చిత్రాలకు పైగా నటించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న కుమార్ ఖోస్లా అలియాస్ బీర్బల్ కన్నుమూశారు. ఆ తర్వాత మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి సోదరి అమీనా (70) కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత గోకినేని ప్రసాద్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన వయోభారంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుత గోకినేని వయసు 73 సంవత్సరాలు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న తన నివాసంలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోకినేని ప్రసాద్ కి చికిత్స అందిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు.

నిర్మాత గోకినేని ప్రసాద్ కు ఒక కుమారుడు ఉన్నారు.. ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కటుంబ సభ్యులు తెలిపారు. నిర్మాతగా ఈ చరిత్ర ఏ సిరతో, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం, పల్నాటి పులి అలాంటి హిట్ చిత్రాలు నిర్మించారు. ఇండస్ట్రీలో గోకినేని ప్రసాద్ అందరితోో చాలా గౌరవంగా నడుచుకునేవారని.. ఎంతో నీగర్వి అని.. చాలా హుందాగా వ్యవహరించేవారని సహ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.  గోకినేని ప్రసాద్ మృతి విషయం తెలియగానే టాలీవుడ్ లో ఒక్కసారే విషాదం నిండుకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపానని వ్యక్తం చేస్తున్నారు.