iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘నక్షత్రం’ సినిమా నిర్మాత కన్నుమూత!

  • Published Nov 09, 2023 | 8:11 PM Updated Updated Nov 09, 2023 | 9:01 PM

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత కన్నుమూశారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు.

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. సినీ నిర్మాత కన్నుమూశారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు.

  • Published Nov 09, 2023 | 8:11 PMUpdated Nov 09, 2023 | 9:01 PM
ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘నక్షత్రం’ సినిమా నిర్మాత కన్నుమూత!

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టాలీవుడ్ కు చెందిన ఓ ప్రొడ్యూసర్ కన్నుమూశారు. ఈ ఘటన ఈ రోజు ఉదయం వెలుగు చూసింది. ”తులసి దళం, ఆనందోబ్రహ్మ’’ సీరియల్స్, ‘నక్షత్రం’ సినిమా నిర్మాత సాతులూరి వేణుగోపాల్ ఈరోజు పొద్దున ఆత్మహత్య చేసుకున్నారట. ఈ విషయాన్ని యండమూరి వీరేంద్రనాథ్ వెల్లడించారు. ఆయన ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. సాతులూరి వేణుగోపాల్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే కొంత కాలం నుంచి ఆయన ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

స్టార్ డైరెక్టర్ క్రిష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన నక్షత్రం సినిమాను సాతులూరి వేణుగోపాల్ నిర్మించారు. సందీప్ కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా 2017లో విడుదలైంది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే సాతులూరి వేణుగోపాల్ ఆత్మహత్యకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చునని వారితో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న యండమూరి వీరేంద్రనాథ్ గారు చెబుతున్నారు. కారణం ఏదైనా.. ఓ తెలుగు టీవీ, సినీ నిర్మాత ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం బాధగా ఉందంటూ శోకతప్త హృదయంతో వెల్లడించారు. సినీ నిర్మాత సాతులూరి వేణుగోపాల్ మృతికి ఆరోగ్య సమస్యలతో పాటు మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss