iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో అందరీ ఫేవరేట్ హీరోయిన్

  • Published Aug 05, 2024 | 6:59 PM Updated Updated Aug 05, 2024 | 6:59 PM

Pic Talk: పై ఫోటోలో ఉన్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఈమె ఓస్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈ చిన్నారి నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో ఉన్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఈమె ఓస్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈ చిన్నారి నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 05, 2024 | 6:59 PMUpdated Aug 05, 2024 | 6:59 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో అందరీ ఫేవరేట్ హీరోయిన్

ఈ మధ్య స్పెషల్ అకేషన్ తగ్గట్టుగా.. సినీ ఇండస్ట్రీకి చెందిన అందాల తారలు, స్టార్ హీరోల త్రో బ్యాక్ ఫోటోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. అయితే వాటిలో సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్, స్కూల్,కాలేజీ డేస్, టీనేజ్ ఫోటోస్ దర్శనమిస్తుంటాయి. కాగా, వాటిలో కొన్ని సినీ తారలే వారి పుట్టిన రోజు,ఏదైనా స్పెషల్ మూమెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. మరి కొన్ని ఫోటోస్ ను వారి ఫ్యాన్స్ వెతికి మరీ సామాజిక మాధ్యమాల్లో షేర్లు కొడుతూ తెగ హంగామా చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ పై ఫోటోలో ఉన్న ఈ బోసి నవ్వుల చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఈమె ఓస్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈ చిన్నారి నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా హా..హా.. హాసని అంటూ తెలుగు ప్రేక్షుకులకు ఫేవరేట్ హీరోయిన్ గా నిలిచిపోయింది ఈ బ్యూటీ. అంతేనా.. వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అంటూ ఓవర్ నైట్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. మరీ, ఆమె ఎవరో కాదు.. ‘జెనీలియా దేశ్‌ముఖ్‌’. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఎందుకంటే.. ఇండస్ట్రీలోని స్టార్ ఈ అమ్మాడు ఒకరు. ఇదిలా ఉంటే.. జెనీలియా మొదటిగా హిందీలో 2003లోని ‘తుఝే మేరీ కసమ్’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అదే సంవత్సరంలో తమిళ్ లో ‘బాయ్స్’ సినిమా డబ్బింగ్ తో తెలుగునాట కూడా పరిచయమైంది.

Genelia

అయితే ఈ సినిమాలో జెనీలియా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో తెలుగులో నేరుగా ‘సత్యం’ సినిమాతో జెనీలియా హీరోయిన్ గా పరిచయమైంది. ఇక సినిమాలో కూడా ఈ బ్యూటీ అందం, నటనతో ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే.. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది జెనీలియా. అలాగే తెలుగులోనే కాకుండా ఇటు హిందీ, తమిళ్, మరాఠీ సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో 2012లో నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు మగ పిల్లలు.

అయితే పిల్లలు పుట్టిన తర్వాత.. జెనీలియా మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రితీష్ దేశ్ ముఖ్ తో వేద్ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. అలాగే పలు సినిమాల్లో గెస్ట్ రోల్స్‌ లో కూడా మెరిసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. జెనీలియా మంచి  జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కావడం గమన్హారం. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు ఆటల్లో ముందుండేది. ఇకపోతే నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ, జెనీలియా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss