iDreamPost
android-app
ios-app

ప్రియుడ్ని పెళ్లాడబోతున్న టాలీవుడ్ హీరోయిన్..!

  • Published Jan 12, 2024 | 3:09 PM Updated Updated Jan 12, 2024 | 3:09 PM

బాలీవుడ్ టూ కోలీవుడ్ వరకు ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. వరుణ్- లావణ, అశోక్ సెల్వన్, అమలాపాల్, తాజాగా అమీర్ ఖాన్ కూతురు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో టాలీవుడ్ నటి..

బాలీవుడ్ టూ కోలీవుడ్ వరకు ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. వరుణ్- లావణ, అశోక్ సెల్వన్, అమలాపాల్, తాజాగా అమీర్ ఖాన్ కూతురు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో టాలీవుడ్ నటి..

  • Published Jan 12, 2024 | 3:09 PMUpdated Jan 12, 2024 | 3:09 PM
ప్రియుడ్ని పెళ్లాడబోతున్న టాలీవుడ్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ నటీ నటులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. గత ఏడాది సగంలో టాలీవుడ్ యంగ్ హీరోస్ శర్వానంద్, వరుణ్ తేజ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అటు దగ్గుబాటి వారసుడు, రానా తమ్ముడు అభిరామ్ వివాహం జరిగింది. ఇక బాలీవుడ్ లో సైతం సిద్దార్థ్ మల్హోత్రా, కియారా మెడలో మూడు ముళ్లు వేశాడు. పరిణీతి చోప్రా..ఎంపీ రాఘవ్ చద్దాను మనువాడింది. అలాగే మనోజ్-భూమా జంట కూడా గత ఏడాది ఒక్కటైంది. కోలీవుడ్‌లో ప్రముఖ హీరో అశోక్ సెల్వన్ నటిని వివాహం ఆడాడు. నటి అమలా పాల్ కూడా సెకండ్ లైఫ్ స్టార్ చేసింది. తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూతురు వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి విదితమే.

అలాగే రకుల్ ప్రీత్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. విజయ్-రష్మిక నిశితార్థం అంటూ రూమర్స్ వచ్చాయి. ఇప్పడు మరో టాలీవుడ్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. 2011లో బ్రమ్మిగాడి కథ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన అస్మితా సూద్.. తన ప్రియుడ్ని పెళ్లాడనుంది. ఆమెకు కాబోయే భర్త పేరు సిద్ధ్ మెహతా. ఏడాదిన్నర కాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట..గత ఏడాది సెప్టెంబర్‍లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే నెల మొదటి వారంలో గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. సిద్ధ్ మెహతా.. గుజరాత్ రాజ్ కోట్‌కు చెందిన వ్యాపార వేత్త.

గతంలో వెకేషన్ వెళ్లిన ఫోటోలను నెట్టింట్లో షేర్ చేయగా.. వైరల్ అయిన సంగతి విదితమే. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అస్మితా సూథ్.. వరుణ్ సందేశ్ మూవీ బ్రమ్మి గాడి కథతో ఎంట్రీ ఇచ్చింది. విక్టరీ మూవీతో కన్నడ, 5 సుందరికల్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అమ్మడు. సుధీర్ బాబు ఆడు మగాడ్రా బుజ్జి, ఓకే, ఆ ఐదుగురు వంటి చిత్రాల్లో నటించింది. అలాగే టీవీ సీరియల్స్ కూడా చేసింది. 2018లో విక్టరీ 2 అనే కన్నడ మూవీలో చివరిగా కనిపించింది. 2020లో ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ నటి.. ధారావాహికల్లో కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Asmita Sood (@asmita_s)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş