iDreamPost
android-app
ios-app

Anushka: ఇన్నాళ్ల తర్వాత బయటకొచ్చిన హీరోయిన్! అనుష్క లేటెస్ట్ పిక్స్ వైరల్

  • Published Mar 12, 2024 | 11:40 AM Updated Updated Mar 12, 2024 | 11:40 AM

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సరే.. నటి అనుష్కకు ఉండే ఫ్యాన్ బేస్ మాత్రం వేరు. అయితే ఈ మధ్య కాలంలో ఓ రకంగా అనుష్క తెరమీద కనిపించడమే అరుదైపోయింది. దీనితో ఆమె ఫ్యాన్స్ అనుష్క సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. ఎట్టకేలకు దర్శనం ఇచ్చింది అనుష్క.

టాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సరే.. నటి అనుష్కకు ఉండే ఫ్యాన్ బేస్ మాత్రం వేరు. అయితే ఈ మధ్య కాలంలో ఓ రకంగా అనుష్క తెరమీద కనిపించడమే అరుదైపోయింది. దీనితో ఆమె ఫ్యాన్స్ అనుష్క సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో.. ఎట్టకేలకు దర్శనం ఇచ్చింది అనుష్క.

  • Published Mar 12, 2024 | 11:40 AMUpdated Mar 12, 2024 | 11:40 AM
Anushka: ఇన్నాళ్ల తర్వాత బయటకొచ్చిన హీరోయిన్! అనుష్క లేటెస్ట్ పిక్స్ వైరల్

సాధారణంగా కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలతో.. ఒక మార్క్ చేసుకుంటారు. వారి డిమాండ్ పెరుగుతుంది అనుకునే క్రమంలో ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటారు. ఇక వారిలో కొంతమంది మాత్రం సినిమాలు చేయకపోయినా సరే, అపుడపుడు మీడియాలోనో, సోషల్ మీడియాలోనో కనిపిస్తూ ఉంటారు. కానీ, మరి కొంతమంది మాత్రం అసలు ఎక్కడా కనిపించరు. అటువంటి వారిలో ఒకరు టాలీవుడ్ బ్యూటీ అనుష్క. బాహుబలి సినిమాతో అనుష్క రేంజ్ మరో లెవెల్ కు మారిపోయింది. ఇక ఆ తర్వాత అనుష్క లాస్ట్ గా కనిపించింది.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలోనే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత అనుష్క అందరికి దర్శనం ఇచ్చింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

బాహుబలి సినిమా చేసే టైమ్ లోనే అనుష్క .. ‘సైజ్ జీరో’ సినిమాను కూడా చేసింది. అయితే ఆ సినిమా కోసం అనుష్క ఉన్నట్టుండి.. నిజంగానే బరువు పెరిగింది. ఇక అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరం అయిందని చెప్పి తీరాలి. ఆ సినిమా కోసం వెయిట్ గెయిన్ అయితే అయింది . కానీ, అనుకున్న విధంగా అంత ఈజీగా వెయిట్ లాస్ అయితే.. అవ్వలేకపోయింది. సైజ్ జీరో సినిమా తర్వాత అనుష్క కొన్ని సినిమాలైతే తీసింది కానీ.. ఆ సినిమాలు ఏవి అనుష్క రేంజ్ కు తగినవి కాదని చెప్పి తీరాలి. ఇక ఆఖరిగా అనుష్క తెరపైన హీరోయిన్ గా కనిపించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. కానీ, ఆ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా అనుష్క అంతగా బయటకు రాలేదు. దీనితో అభిమానులలో ఈ విషయం గురించి రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.

Anushka in Slim Look

బరువు ఎక్కువగా ఉండడం వలన , కామెంట్స్ చేస్తారేమో అనే భయంతో ఆమె బయటకు రావట్లేదా.. లేదా.. మరేమైనా కారణాలు ఉన్నాయా అని.. నెట్టింట అనుష్క గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక అందరి ప్రశ్నలకు చెక్ పెట్టేలా .. తాజాగా ఈ అమ్మడు దర్శనమిచ్చింది. ఇటీవల ఓ మలయాళ సినిమా షూటింగ్ లో పాల్గొనిందట అనుష్క. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలలో అనుష్క స్లిమ్ లుక్ లో అందరిని ఆశ్చర్యపరిచింది. దీనితో అనుష్క అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. వింటేజ్ అనుష్క ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క కనుక మళ్ళీ ఫార్మ్ లోకి వస్తే.. ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇవ్వడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి, అనుష్క లేటెస్ట్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio