iDreamPost
android-app
ios-app

ఈ అక్కా చెల్లెళ్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్లు..!

  • Published May 30, 2024 | 5:54 PM Updated Updated May 30, 2024 | 5:54 PM

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి అక్కా చెల్లెళ్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన స్టార్ హీరోయిన్లు. ఇందులో ఒకరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరొకరు..

ఈ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి అక్కా చెల్లెళ్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన స్టార్ హీరోయిన్లు. ఇందులో ఒకరు ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరొకరు..

  • Published May 30, 2024 | 5:54 PMUpdated May 30, 2024 | 5:54 PM
ఈ అక్కా చెల్లెళ్లు.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్లు..!

సినిమా ఇండస్ట్రీలోకి ఒక హీరో/ హీరోయిన్ వెంట వారసులు/వారసురాలు రావడం కామన్. ఇప్పుడు ఇదే నెపోటిజం పేరుతో పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఈ విషయాన్ని తీసి పక్కన పెడితే.. హీరోయిన్లతో పోలిస్తే.. హీరోల తరుఫున తోబుట్టువులు, బంధువులు యాక్టర్స్‌గానే లేక నిర్మాణ రంగంలో స్థిరపడుతుంటారు. ఇక ఒక హీరోయిన్ క్లిక్ అయ్యిందంటే.. ఆమె వెంట సోదరుడు లేదా సోదరి క్యూ కడుతుంటారు. కానీ క్లిక్ కావడం చాలా అరుదు. ఆనాటి లలిత, రాగిణి, పద్మిని దగ్గర నుండి ఈనాటి సాయి పల్లవి- పూజా కన్నన్ వరకు ఇదే జరిగింది. కేవలం ఒకరు మాత్రమే గట్టిగా క్లిక్ అవుతుంటారు. మరొకరు కాస్త తక్కువగా క్రేజ్ సంపాదించుకుంటారు. అయినప్పటికీ క్రేజీ హీరోయిన్‌గా గుర్తిండిపోతుంటారు.

ఇదిగో ఈ కోవలేకే వస్తారు ఈ ఫోటోలోని అక్కా చెల్లెళ్లు కూడా. తెలుగు ఇండస్ట్రీతో విడదీయ రాని అనుబంధం వీరిది. ఇద్దరు కూడా తెలుగు సినిమాలతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ చేయడంతో పాటు స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఒకరేమో స్టార్ హీరోయిన్‌గా ఎదిగితే.. మరొకరు మంచి ఫేమ్, నేమ్ తెచ్చుకుంది. తమ అందచందాలతో టాలీవుడ్‌ను ఆకట్టుకున్న ఈ చిన్నారులు ఎవరంటే.. కాజల్ అగర్వాల్ అండ్ నిషా అగర్వాల్. పేరుకు అక్కా చెల్లెళ్లే కానీ.. అంతకు మించిన స్నేహ బంధం వీరిది. పెళ్లిళ్లయ్యి.. పిల్లలు పుట్టినా కూడా ఇప్పటికి అదే బాండింగ్ వీరి మధ్య కొనసాగుతుంది. ఇదే విషయాన్ని తాజాగా ఓ వీడియో ద్వారా బయటపెట్టింది చెల్లి నిషా అగర్వాల్.

ఇక మన కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే.. లక్ష్మీ కళ్యాణంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల బొమ్మ.. సెకండ్ పిక్చర్ చందమామతో.. టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకుంది. మగధీర ఆమెను స్టార్ హీరోయిన్ చేసింది. అక్కడి నుండి వెనుదిరిగి చూసుకున్నది లేదు. ఇప్పుడు కూడా సత్యభామ అనే మూవీతో ముందుకు రాబోతుంది. ఇవే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో నటిస్తూ పెళ్లైన తర్వాత కూడా బిజీ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇక అక్క అడుగు జాడల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది చెల్లెలు నిషా అగర్వాల్. ఏమైందీ ఈ వేళ మూవీతో క్రేజీ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. సోలోతో సూపర్ హిట్ అందుకుంది. సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి చిత్రాల్లో నటించింది. రెండు మలయాళ సినిమాలు చేసి నటనకు గుడ్ బై చెప్పి.. అక్క కన్నా ముందే పెళ్లి పీటలు ఎక్కింది. ఇప్పడు ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది. ఆమెకొక బాబు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ప్రతి విషయాన్ని పోస్టు చేస్తూ ఉంటుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş