iDreamPost
android-app
ios-app

విశాల్ హీరోయిన్ ఇంట విషాదం.. మర్చిపోలేక పోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్!

  • Published Aug 31, 2024 | 10:02 PM Updated Updated Aug 31, 2024 | 11:20 PM

Abhinaya, Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్​ సరసన హీరోయిన్​గా కనిపించి అలరించిన ఓ నటి ఇంట విషాదం నెలకొంది. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. తనను మర్చిపోలేక పోతున్నానంటూ భావోద్వేగానికి లోనైంది.

Abhinaya, Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్​ సరసన హీరోయిన్​గా కనిపించి అలరించిన ఓ నటి ఇంట విషాదం నెలకొంది. దీంతో ఆమె చాలా ఎమోషనల్ అయిపోయింది. తనను మర్చిపోలేక పోతున్నానంటూ భావోద్వేగానికి లోనైంది.

  • Published Aug 31, 2024 | 10:02 PMUpdated Aug 31, 2024 | 11:20 PM
విశాల్ హీరోయిన్ ఇంట విషాదం.. మర్చిపోలేక పోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్!

ప్రముఖ నటి అభినయ గురించి తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ దగ్గర నుంచి ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తూ ఫేమ్ సంపాదించారామె. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గానే గాక నెగెటివ్ రోల్స్​లోనూ యాక్ట్ చేశారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. అందం, అభినయంతో మంచి నటిగా క్రేజ్ సంపాదించారు. అలాంటి అభినయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి అకస్మాత్తుగా మృతి చెందింది. రిక్షాలో బయటకు వెళ్లిన ఆమె అనుకోని విధంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని స్వయంగా అభినయ వెల్లడించారు. ఆగస్టు 17వ తేదీన ఇదంతా జరిగిందని తెలిపారు. తల్లి మరణాన్ని తలచుకొని ఆమె ఫుల్ ఎమోషనల్ అయ్యారు.

తల్లి మృతిపై ఇన్​స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయ్యారు అభినయ. అమ్మ లేదనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని.. ఇలా హఠాత్తుగా విడిచి వెళ్తారని అనుకోలేదని భావోద్వేగానికి లోనయ్యారు. ‘నువ్వు లేవనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా. ఇలా మమ్మల్ని విడిచి వెళ్తావని అనుకోలేదు. తాతలాగే నువ్వూ రిక్షాలోనే కన్నుమూశావ్. తండ్రీ-కూతురు ఇలా ఒకేలా చనిపోవడం ఎంతో యాదృచ్ఛికం. నీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ప్రతి చోట నాకు అండగా నిలబడ్డావ్. ఇంకో జన్మంటూ ఉంటే మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పటికీ మాతో ఉంటావమ్మ’ అని ఆ పోస్ట్​లో అభినయ రాసుకొచ్చారు.

ఇక, అభినయ పుట్టుకతోనే బధిర అనే విషయం తెలిసే ఉంటుంది. ఆమెకు వినపడదు.. మాట్లాడలేదు కూడా. అయినా అంకితభావం, పట్టుదలతో యాక్టింగ్ కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా కంటిన్యూ చేస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో వెంకటేశ్-మహేశ్ బాబు సోదరిగా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారామె. ‘కింగ్’, ‘శంభో శివ శంభో’, ‘ఢమరుకం’, ‘రాజు గారి గది 2’, ‘సీతారామం’, ‘గామి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ లాంటి ఇతర తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సరసన ‘మార్క్ యాంటోనీ’ యాక్ట్ చేశారు. అభినయ తల్లి మరణ వార్త తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్ట సమయాన్ని దాటి ఆమె మళ్లీ సినిమాలతో బిజీ అయిపోవాలని అంటున్నారు. ఈ బాధ, దు:ఖాన్ని తట్టుకునే శక్తి ఆమెకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet GirişJojobetjojobet