iDreamPost
android-app
ios-app

Megha Akash: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్..ఫోటోలు వైరల్!

  • Published Sep 15, 2024 | 4:01 PM Updated Updated Sep 15, 2024 | 4:01 PM

Megha Akash: ఇటీవల కాలంలో పలువురు హీరో, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెబుతూ..కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

Megha Akash: ఇటీవల కాలంలో పలువురు హీరో, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెబుతూ..కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

  • Published Sep 15, 2024 | 4:01 PMUpdated Sep 15, 2024 | 4:01 PM
Megha Akash: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్..ఫోటోలు వైరల్!

ఇటీవల కాలంలో పలువురు హీరో, హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమ బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెబుతూ..కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి పలువురు స్టార్ హీరోయిన్లు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అలానే పలువురు ప్రముఖ యాక్టర్లు సైతం పెళ్లి చేసుకుని..సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా టాలీవుడ్ హీరోయిన్ కూడా వారి బాటలోనే పయనించింది. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహం చేసుకుంది. ఇక  ఈ బ్యూటీ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ మరో స్టార్ యాక్టర్ అయినా సాయి విష్ణుని వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహ వేడుక సెప్టెంబర్ 14 శనివారం చెన్నైలో జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధవు మిత్రులు, పలువురు ప్రముఖల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కాగా మేఘా ఆకాష్ పెళ్లికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హాజరై…నూతన దంపతులను ఆశీర్వదించారు. అలానే మేఘా వెడ్డింగ్ కి  మరింతమంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ క్రమంలో తాజాగా మేఘా ఆకాష్ తన పెళ్లి గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానాలతో షేర్ చేసుకుంది. “ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్’ అని పేర్కొంటూ తన పెళ్లి ఫోటోలు జోడించింది. కొందరు అభిమానులు, పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మేఘా ఆకాష్ కి వెడ్డింగ్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇక మేఘా ఆకాష్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు. దీంతో పెళ్లి తర్వాత కూడా తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాలో నటించింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లై, చల్ మోహన్ రంగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించించింది. అలానే రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు సినిమాలు చేస్తోంది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ టాలీవుడ్ ప్రేక్షకులకి సుపరిచితమే. ఈ మధ్యకాలంలో మేఘ ఆకాష్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకి విరామం  ఇచ్చి తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏకాంగా వివాహం చేసుకుని బ్యాచ్ లర్  లైఫ్ కి గుడ్ బై చెప్పింది. మరి మేఘా ఆకాశ్ కి మీరు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Megha Akash (@meghaakash)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio