iDreamPost
iDreamPost
నిన్నంతా హైదరాబాద్ రాడిసన్ బ్లూ పబ్బులో జరిగిన వ్యవహారం గురించి మీడియా హోరెత్తిపోయింది. ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల పేర్లు బయటికి రావడం, కొందరిని స్టేషన్ కు తీసుకెళ్లి వదిలేసిన వీడియోలు వైరల్ కావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం రచ్చ మాములుగా జరగలేదు. న్యూస్ ఛానల్స్ రోజు మొత్తం ఈ పనిమీదే ఉన్నాయి. నిజానికి ఎవరూ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ చూపించలేదు. రాహుల్ సిప్లిగుంజ్ తానే తప్పు చేయలేదని ఓపెన్ గా చెబుతున్నాడు. నీహారిక తరఫున నాగబాబు క్లియర్ గా స్టేట్ మెంట్ ఇచ్చారు. గల్లా అశోక్ మీద వచ్చినవన్నీ పుకార్లేనని ప్రెస్ నోట్ వచ్చింది.
‘
ఇక అనవసరంగా తన పేరు చూపించడం మీద ఫైర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఇదంతా అంతులేని కథలా కొనసాగుతూనే ఉంది. గతంలోనూ ఇదే తరహాలో డ్రగ్స్ దందా బయటికి రావడం, స్టార్ హీరోలు దర్శకులు విచారణకు హాజరై వివరణ ఇవ్వడం అందరికీ గుర్తే. నెలల తరబడి ఈ వ్యవహారం నాని నాని ఫైనల్ గా క్లీన్ చిట్ వచ్చేసింది. అది ఇంకా మర్చిపోక ముందే ఈ పబ్ తాలూకు రచ్చ మొదలైంది. నిజానికి లేట్ నైట్ కూడా పార్టీలు చేసుకునేందుకు అనుమతి ఉన్న హై ప్రొఫైల్ ఫైవ్ స్టార్ పబ్ అది. అందులో చట్టవ్యతిరేకం ఏమి లేదన్నది అక్కడ పని చేస్తున్న వర్గాల మాట.
ఇకవేళ మాదకద్రవ్యాల వినియోగం నిజమే అయితే దానికి ఓ ప్రొసీజర్ ఉంటుంది. పోలీసులైనా దాన్ని ఫాలో అయిపోయి అసలు దోషులను పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ పబ్బులో వాటి తాలూకు ఆనవాళ్లు కొన్ని దొరికాయని అంటున్నారు కానీ వాటిని ఎవరు వాడారనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. ఇప్పుడీ గొడవైనా మహా అయితే ఇంకో వారం రోజులు లేదా ఒక నెల అంతే. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. పట్టించుకునే వాళ్ళు కానీ ఫైనల్ గా ఏమైందని ఫాలో అప్ చేసే వాళ్ళు కానీ కనిపించరు. అందుకే అంతులేని కథగా వస్తున్న ఈ ఉదంతాలు చూస్తూ ఉండటం తప్ప ఎవరు మాత్రం చేయగలిగింది ఏముంది
Also Read : Beast : విజయ్ కొత్త సినిమాలో పాత ట్విస్టులా