P Venkatesh
నటుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే మొదటి భారతీయ నటుడిగా అరుదైన హిస్ట్రీ క్రియేట్ చేశారు. ఫిలిప్పీన్స్ వేదికగా అరుదైన బిరుదును అందుకున్నారు నరేష్.
నటుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే మొదటి భారతీయ నటుడిగా అరుదైన హిస్ట్రీ క్రియేట్ చేశారు. ఫిలిప్పీన్స్ వేదికగా అరుదైన బిరుదును అందుకున్నారు నరేష్.
P Venkatesh
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు నటుడు నరేష్. ఇటీవలే సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు ఈ సీనియర్ నటుడు. తాజాగా నటుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోనే మొదటి నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఈ అరుదైన ఘట్టానికి ఫిలిప్పీన్స్ వేదికైంది. ఇంతకీ నటుడు నరేష్ అందుకున్న ఆ అరుదైన గౌరవం ఏంటంటే?
నటుడు నరేష్ కు అరుదైన గౌరవం దక్కింది. నరేష్ ఇప్పుడు ఏఎంబీ లెఫ్ట్‌నెంట్ కల్నల్ సర్ డాక్టర్ నరేష్ విజయకృష్ణ పీహెచ్‌డి. ది నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్, యూఎన్ఓలో ముఖ్య విభాగమైన ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంయుక్తంగా ఫిలిప్పీన్స్‌లోని కుజాన్ నగరంలో ఈనెల 24న ఐదవ వరల్డ్ కాంగ్రెస్ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొనే గౌరవం సీనియర్ నటుడు నరేష్‌కు దక్కింది. ఈ సమావేశంలో పోలీస్, డిఫెన్స్ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉగ్రవాదంపై డాక్టర్ నరేష్ చేసిన ఉపన్యాసాలు ప్రశంసలు అందుకున్నాయి.
ఇక నిన్న జరిగిన వరల్డ్ కాంగ్రెస్‌లో నరేష్‌ను ‘సర్’ అనే అత్యున్నత బిరుదుతో సత్కరించారు. అలాగే, ఆయనకు మిలటరీ ఆర్ట్స్ అండ్ హ్యూమన్ సర్వీస్‌లో గౌరవ డాక్టరేట్ అందజేశారు. అంతేకాకుండా, ఆర్బిట్రేషన్ అండ్ శాంతి మధ్యవర్తిత్వంలో సభ్యుడిగా నరేష్‌కు గుర్తింపునిచ్చారు. అనంతరం, ఆయనకు పౌర హక్కుల రక్షకుడు (సివిల్ రైట్స్ డిఫెండర్) అనే టైటిల్ కూడా ఇచ్చారు. అలాగే, గుడ్ విల్ అంబాసడర్‌గా కూడా నియమితులయ్యారు. ఇక ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న నటుడు నరేష్ కు సినీ రాజకీయ ప్రముఖులు అభినందను తెలుపుతున్నారు.
RARE HONOUR FOR ACTOR NARESH… #Telugu actor #NareshVijayKrishna became the first #Indian actor to be honoured as AMB Lt. Colonel Sir Dr Naresh Vijayakrishna PhD at the 5th World Congress summit in #Philippines for his lectures on counter terrorism in the national headquarters of… pic.twitter.com/TR89JgLyay
— taran adarsh (@taran_adarsh) November 25, 2023