హార్ట్ ఎటాక్‌తో మైకేల్ జాక్సన్ సోదరుడు కన్నుమూత!

Michael Jackson Brother Tito Jackson: సంగీత ప్రపంచంలో నూతన ఒరవడి సృష్టించి కోట్ల మంది అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ సోదరులు సైతం సింగర్స్, మ్యుజీషియన్స్. మైకేల్ జాక్సన్ ఇంట విషాదం నెలకొంది.

Michael Jackson Brother Tito Jackson: సంగీత ప్రపంచంలో నూతన ఒరవడి సృష్టించి కోట్ల మంది అభిమానులను ఉర్రూతలూగించిన పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ సోదరులు సైతం సింగర్స్, మ్యుజీషియన్స్. మైకేల్ జాక్సన్ ఇంట విషాదం నెలకొంది.

ఇటీవల సినీ, రాజకీయ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, క్యాన్సర్ ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు..  అభిమానులు సైతం దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మైకేల్ జాక్సన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కోట్లలో ఆయనకు అభిమానులు ఉన్నారు. మైకేల్ జాక్సన్ మాత్రమే కాదు.. ఆయన సోదరులు కూడా సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ సోదరుడు కన్నుమూశాడు. ఈ వార్త విన్న సంగీత ప్రియులు ఒక్కసారే దిగ్బ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళితే..

దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మైఖేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్ 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మీడియా కథనాల ప్రకారం టిటో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. టిటో జాక్సక్ మృతికి సంబందించిన సమాచారం ఆయన కుమారులు సోషల్ మీడియాతో పంచుకున్నారు. తమ తండ్రి మరణంపై ‘ మా ప్రియమైన తండ్రి.. రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ టిటో జాక్సన్ మాతో ఉండరన్న విషయం బరువెక్కిన హృదయాలతో ప్రకటిస్తున్నాం.. మా అభివృద్ది కోసం ఆయన ఎంతో శ్రమించారు.. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రముఖ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ సోదరుడు టిటో జాక్సన్. అభిమానులు ఆయనను కోచ్ టిటో, పొప్పటి గా పిలుచుకుంటారు. మైకేల్ జాక్సన్ కెరీర్ బిగినింగ్ లో టిటో జాక్సన్ ఎంతో సహాయంగా ఉండేవారు. మైకేల్ జాక్సన్ లాగే ఆయన కూడా సంగీత ప్రపంచంలో ఫేమస్. టిటో గిటార్ వాయించడంలో గొప్ప నైపుణ్యం సంపాదించారు. 2016 లో అతను తన మొదటి సోలో ఆల్బమ్ ‘టిటో టైమ్’ ని విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. తన అద్భుతమైన గానం, నృత్య ప్రదర్శనతో ఆకర్షించేవారు. మైకేల్ జాకసన్ సోదరుడు టిటో జాకసన్ మరణంపై అభిమానుల, సంగీత ప్రియులు సైంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show comments