P Krishna
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సలార్ ను మరో వారం రోజుల్లో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు థియేటర్ల ద్వార చూడబోతున్నారు. ఈ సమయంలో సలార్ ముందు ఉన్న సవాళ్ల గురించి చర్చ జరుగుతోంది.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందిన సలార్ సినిమా విడుదలకు సిద్ధం అయింది. దాదాపు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సలార్ ను మరో వారం రోజుల్లో ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు థియేటర్ల ద్వార చూడబోతున్నారు. ఈ సమయంలో సలార్ ముందు ఉన్న సవాళ్ల గురించి చర్చ జరుగుతోంది.
P Krishna
ప్రభాస్ అభిమానులతో పాటు పాన్ ఇండియా రేంజ్ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. క్రిస్మస్ కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు షారుఖ్ ఖాన్ డంకీ రూపంలో అతి పెద్ద ఛాలెంజ్ ఎదురు కాబోతుంది. కేజీఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై మొదటి నుంచే మాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కనుక భారీ ఓపెనింగ్స్ దక్కడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. సలార్ కి విపరీతమైన క్రేజ్ ఉంది.. అయితే ఇదే సమయంలో మూడు ఛాలెంజ్ లను ఈ సినిమా ఎదుర్కోవాల్సి ఉంది.
ప్రభాస్ బాహుబలి 2 తర్వాత మినిమం హిట్ కూడా అందుకోలేక పోయాడు. ఆయన నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వచ్చి డిజాస్టర్ అయ్యాయి. అందుకే ఈ సినిమా విషయంలో కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. సలార్ సినిమా ప్రభాస్ గత చిత్రాల ఫ్లాప్ సెంటిమెంట్ ను మొదటి ఛాలెంజ్ గా ఎదురుకొంటూ ఉంది. గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా సలార్ విషయంలో అలా జరుగదు అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నా కూడా ప్రేక్షకులు కూడా ఆ విషయాన్ని బలంగా నమ్మే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ వారం రోజులు భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సలార్ కి పోటీగా డంకీ సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పరిస్థితి ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డంకీ సినిమా ఎలాగూ మాస్ ఆడియన్స్ కి కాస్త దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనక కచ్చితంగా హిందీ మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. సౌత్ తో పాటు నార్త్ లో మాస్ ఆడియన్స్ వల్ల ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా వస్తే కచ్చితంగా రికార్డుల వర్షం కురిసే అవకాశం ఉంది. మరి డంకీని దాటి సలార్ కి మాస్ ఆడియన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా చూడాలి. ఇక ఓవర్సీస్ లో కచ్చితంగా షారుఖ్ తీవ్రమైన పోటీని సలార్ ముందు ఉంచే అవకాశం ఉంది. అక్కడ డంకీ ని ఎదుర్కోవడం సలార్ కి అతి పెద్ద ఛాలెంజ్ అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓవర్సీస్ లో సలార్ భారీగా డాలర్లు సాధిస్తేనే వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేయగలుగుతుంది. మరి ఈ మూడు ఛాలెంజ్ లను సలార్ సమర్ధవంతంగా ఎదుర్కొని వెయ్యి కోట్ల వసూళ్లను సాధిస్తుందని మీరు భావిస్తున్నారా?