iDreamPost
android-app
ios-app

ప్రభుదేవా స్టెప్పులు నేర్పిస్తున్న ఈ పిక్.. వెనుక ఓ పెద్ద కథే ఉంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ ది బెస్ట్ పెయిర్ అనగానే గుర్తుకు వచ్చేది చిరంజీవి- విజయ్ శాంతి. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేవారు. 21 సినిమాలు చేసిన ఈ క్రేజీ కాంబో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ ది బెస్ట్ పెయిర్ అనగానే గుర్తుకు వచ్చేది చిరంజీవి- విజయ్ శాంతి. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయేవారు. 21 సినిమాలు చేసిన ఈ క్రేజీ కాంబో..

ప్రభుదేవా స్టెప్పులు నేర్పిస్తున్న ఈ పిక్.. వెనుక ఓ పెద్ద కథే ఉంది!

వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి- లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి ది బెస్ట్ పెయిర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ పరంగానే కాకుండా డ్యాన్సుల్లో కూడా పోటీ పోటీగా చేసేవారిద్దరూ. వీరిద్దరూ కలిసి 21 సినిమాలు చేశారంటే.. ఎంతటి హిట్ కాంబినేషనో అర్థం చేసుకోవచ్చు. సంఘర్షణ అనే మూవీతో మొదలైన.. మెకానిక్ అల్లుడు చిత్రం వరకు సాగింది. ఇక అప్పటి నుండి ఈ క్రేజీ కాంబో జతకట్టలేదు. ఈ జోడీ మళ్లీ కలిసి సినిమాలు చేయకపోతుందా అని ఎదురు చూశారు. కానీ జరగలేదు. వారి మధ్య ఏదో మనస్పర్థలు వచ్చాయని, అందుకే మళ్లీ కలిసి పని చేయలేదన్న రూమర్లు వచ్చాయి. ఎవరి కెరీర్‌లో వారూ ముందుకు సాగిపోయారు. సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దర్ని చూడగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు.

ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన ఓ స్టిల్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఫోటో చూశారు కదా.. విజయ్ శాంతి, చిరంజీవికి స్టెప్పులు నేర్పిస్తున్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారు కదా.. మన మైఖేల్ జాక్సన్, హీరో కమ్ దర్శకుడు ప్రభుదేవా. ఇంతకు ఈ పిక్ ఏ చిత్రంలోనిదే గుర్తు పట్టారా.. ఈ మూవీ చూసిన వాళ్లంతా బహుశా గుర్తు పట్టేస్తారు కానీ.. నేటి జనరేషన్‌కు కాస్త కష్టమే. ఈ పిక్ ఇండస్ట్రీ హిట్ మూవీలోని ఎవర్ గ్రీన్ సాంగ్‌లోనిది. ఆమె పిక్చర్ పేరేంటంటే.. గ్యాంగ్ లీడర్. ‘వాన వాన వెల్లువాయే.. కొండ కోన తుళ్లిపోయే’ పాటలోని స్టిల్ అది. ఈ పాటను రామ్ చరణ్ రీమేక్ చేసినప్పటికీ.. ఆ పాత పాట మాత్రం క్లాసిక్ సాంగ్. గ్యాంగ్ లీడర్ మూవీకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బప్పీలహరి మ్యూజిక్ అందించాడు.

 ఇప్పటికీ ఆ సాంగ్ వింటుంటే..ఆ మ్యాడ్, క్రేజీనెస్ తగ్గదు. ఎన్ని సార్లు విన్నా.. అలా వినాలపిస్తూనే ఉంటుంది. ఇందులో వీరిద్దరీ కాస్ట్యూమ్స్ నుండి.. డ్యాన్స్, స్టెప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఏదో తెలియని అలజడి మదిలో మెలుగుతూ ఉంటుంది. ఈ మూవీకి ఎంతటి హిట్ కొట్టిదంటే.. తమిళ్, హిందీ, కన్నడ, ఒడియా భాషల్లో రూపొందించారు. విజయ్ బాపినీడు ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమా ఎన్నో వ్యయ ప్రయాసలు పడి తెరకెక్కించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కష్టానికి ప్రతి ఫలం దక్కింది. సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు మూవీలో మాత్రమే జత కట్టారు. ఆ తర్వాత ఎవరి దారుల్లో వారు నడిచారు.

ఇక వీరిద్దిరి కాంబోలో సంఘర్షణ, చిరంజీవి, కొండవీటి దొంగ, మంచిదొంగ, కొండవీటి రాజా, ధైర్యవంతుడు, రుద్ర నేత, స్వయం కృషి, పసివాడి ప్రాణం, ఛాలెంజ్, చాణక్య శపథం, యముడికి మొగుడు, యుద్ధ భూమి,అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, రుద్ర నేత్ర, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, దేవాంతకుడు, మహా నగరంలో మాయగాడు, మెకానిక్ అల్లుడు, గ్యాంగ్ లీడర్ సినిమాలు వచ్చాయి. ఈ మూవీలో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.