iDreamPost
android-app
ios-app

OTTలో ఈ కామెడీ థ్రిల్లర్ మీరు ఇంకా చూడలేదా? మంచి మూవీ మిస్ అయినట్టే!

  • Published Jan 22, 2024 | 8:04 PM Updated Updated Jan 22, 2024 | 8:04 PM

ప్రస్తుతం ఓటీటీ మూవీలదే హవా. ఏ సినిమా వచ్చినా వదలడం లేదు. చివరకు ఎప్పటివో డబ్బింగ్ వర్షన్లలో స్ట్రీమింగ్ అవుతున్నా వాచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ ఆ ఓటీటీలో సందడి చేస్తుంది.

ప్రస్తుతం ఓటీటీ మూవీలదే హవా. ఏ సినిమా వచ్చినా వదలడం లేదు. చివరకు ఎప్పటివో డబ్బింగ్ వర్షన్లలో స్ట్రీమింగ్ అవుతున్నా వాచ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ ఆ ఓటీటీలో సందడి చేస్తుంది.

  • Published Jan 22, 2024 | 8:04 PMUpdated Jan 22, 2024 | 8:04 PM
OTTలో ఈ కామెడీ థ్రిల్లర్ మీరు ఇంకా చూడలేదా? మంచి మూవీ మిస్ అయినట్టే!

సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేసేవారు కొందరైతే.. మరికొంత మంది ఓటీటీల్లో చూస్తూ చిల్ అవుతుంటారు. ఏదైమైనా మూవీ చూడటం మాత్రం పక్కా. అయితే ఇటీవల కాలంలో పరాయి భాషల్లోని చిత్రాలు కూడా డబ్బింగ్ రూపంలో ఓటీటీ ఫ్లాట్ ఫాంల్లోకి వచ్చి సందడి చేస్తున్నాయి. మంచి కథ, కథనంతో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్ సినిమాలు వస్తుంటే వదిలిపెట్టడం లేదు. తెలుగు వర్షన్ లేకపోయినా సరే వాటిని చూసేస్తూ థ్రిల్ ఫీలవుతున్నారు మూవీ లవర్స్. అలాంటి వారి కోసమే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఇంతకు ఆ సినిమా ఏంటీ.. ఆ మూవీ ప్లాట్ ఏంటో తెలుసుకుందాం.

సైంధవ్ మూవీతో ఇటీవల సందడి చేసిన బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్, మంచి కథలను ఎంపిక చేసుకుంటూ వెళుతోంది ఈ బ్యూటీ. జెర్సీ మూవీతో ఆకట్టుకున్న ఈ అమ్మాయి తెలుగులో జోడి, శ్రీ కృష్ణ అండ్ హిజ్ లీల వంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం కన్నడ, హిందీ, తమిళ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు నటించిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. అదే కన్నడ మూవీ ‘ఆపరేషన్ అలమేలమ్మ’. 2017లో రిలీజై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సైతాన్ వెబ్ సిరీస్ గుర్తుంది కదా.. ఆ సిరీస్ లో నటించిన హీరో రిషి.. ఆపరేషన్ అలమేలమ్మ కథానాయకుడు. రాజేష్ నటరంగా, షీలమ్, అరుణ్ బాలాజీ, ధీరజ్ శెట్టి కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Haven't seen this comedy thriller on OTT yet

ఇక ఈ మూవీ డబ్బింగ్ వర్షన్ ఓటీటీలో ఇప్పటికే సందడి చేస్తోంది. తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా అప్పట్లో చాలా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ నచ్చి..సలార్ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఇక కథ విషయానికి వస్తే… బాలుడి కిడ్నాప్ డ్రామా.. అందులో రిషి ఎలా చిక్కుకుపోతాడు అనేది కథ. పరమేష్ (రిషి) ఓ అనాథ. కూరగాయల మార్కెట్ లో పనిచేస్తుంటాడు. లగ్జరీ వస్తువులు అంటే ఇష్టమున్న అతడికి ఓ సంఘటన కీలక మలుపు తిప్పుతుంది. కిడ్నాప్ డ్రామాతో టీచర్ అనన్య (శ్రద్ధ) మహిళతో సంబంధం ఏంటీ అనేది తెరపై చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మరీ ఈ మూవీని ఓటీటీలో చూసి.. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş