iDreamPost
android-app
ios-app

అల్లరి చేస్తున్న ఈ పాప టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ .. ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Feb 08, 2024 | 2:03 PM Updated Updated Feb 08, 2024 | 2:03 PM

ఈ ఫోటోలో నోరు తెరిచి అరుస్తున్న పాపను చూడండి. ఆమె అల్లరిని చూసి.. వెనక నుండి ఓ పిల్లోడు కూడా నవ్వుతున్నాడు. ఇంతకు ఆ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఇంతకు ఆ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో నోరు తెరిచి అరుస్తున్న పాపను చూడండి. ఆమె అల్లరిని చూసి.. వెనక నుండి ఓ పిల్లోడు కూడా నవ్వుతున్నాడు. ఇంతకు ఆ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరోయిన్. ఇంతకు ఆ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం.

  • Published Feb 08, 2024 | 2:03 PMUpdated Feb 08, 2024 | 2:03 PM
అల్లరి చేస్తున్న ఈ పాప టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ .. ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. టిక్ టాక్, డబ్ స్మాష్, రీల్స్, షాట్స్ చేస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా.. పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో వీరిని ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్‌ను చేసేస్తుంది. తమకు వచ్చిన ఇదే పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలను కొల్లగొడుతున్నారు కొందరు. ముఖ్యంగా అమ్మాయిలు. ఊహించిన విధంగా క్లిక్ అయ్యి.. వరుసపెట్టి ఆఫర్లను పొందుతూ.. హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. ఆ తర్వాత ఒక ఇండస్ట్రీ నుండి మరొక పరిశ్రమలోకి అడుగుపెడుతూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. చూడటానికి ఓ నటిలా ఉంటుంది. అదే ఆమెకు ప్లస్ అయ్యింది.

ఈ ఫోటోలో అల్లరి చేస్తున్న పాపను గమనించారా.. ఏదో చిలిపి పని చేసినట్లు లేదు. నోరంతా చాపి.. అరుస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడో హీరోయిన్. కానీ ఆమెను హీరోయిన్ చేసింది డబ్ స్మాష్. ఆ తర్వాత ఆమెకు సినిమాలు రావడం మొదలు పెట్టాయి. ఓ హీరోయిన్‌లా ఉండటం.. ఆమె మూవీ నుండి ఓ డైలాగ్ చెప్పడంతో పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు నటిగా అవకాశాలు రావడం స్టార్ అయ్యాయి. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..ప్రముఖ మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్‌ను తలపించేలా ఉంటే వర్ష బొల్లమ్మ.  ఈ ఫోటోలో కనిపిస్తుంది వర్ష, ఆమె సోదరుడు.

రాజా రాణి మూవీలో నజ్రియా సీన్లను డబ్ స్మాష్ చేసి ఫేమస్ అయ్యింది వర్ష. ఈ వీడియో ఆమెకు ఆఫర్లను తెచ్చిపెట్టాయి. సేతురన్ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అటు నుండి మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోల చిన్న పాత్రల్లో కూడా మెరిసింది. ఇంతలో ఆమె అందాన్ని నటనను తెలుగు పరిశ్రమ గుర్తించి.. ఇక్కడ అవకాశం ఇచ్చింది. అలా ప్రముఖ నిర్మాత.. రాజ్ కందుకూరి తన కుమారుడు శివను పరిచయం చేస్తూ.. తెరకెక్కించిన చూసీ చూడంగానే మూవీలో ఆమెకు ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత తమిళ్ 96లో ఆమె చేసిన పాత్ర.. తెలుగులో కూడా వర్షనే చేసింది. కానీ క్లిక్ అయ్యింది మాత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీతో.

అచ్చు నజ్రియాలా ఉండటం.. రాజా రాణితో ఆమె తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.. వర్ష బొల్లమ్మకు కాస్త ప్లస్ అయ్యింది. ఆ తర్వాత.. ఆమె నటనకు మంచి మార్కలే పడ్డాయి. అటుపై కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తక్కువ కాలంలోనే నాలుగు ఇండస్ట్రీలను చుట్టేసింది అమ్మడు. తెలుగులో స్టాండప్ కమెడియన్, స్వాతి ముత్యం చిత్రాల్లో నటించింది. అవి సోసో అనిపించాయి. కుర్ర హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.  ఇప్పుడు సందీప్ కిషన్‌తో ఊరి పేరు భైరవ కొనతో రాబోతుంది..ఈ కన్నడ కస్తూరి.  ఈ  చిత్రం హిట్ కొట్టి మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss