iDreamPost
android-app
ios-app

ఓయ్ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు చూస్తే నమ్మలేరు

  • Published Feb 09, 2024 | 6:17 PM Updated Updated Feb 09, 2024 | 6:17 PM

ఇప్పుడు అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలు క్లాసిక్ మూవీస్, అండర్ రేటెడ్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి సందడి చేసేందుకు వస్తున్నాయి. అలాంటి ఓ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. అదే ఓయ్.

ఇప్పుడు అంతా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పలు క్లాసిక్ మూవీస్, అండర్ రేటెడ్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి సందడి చేసేందుకు వస్తున్నాయి. అలాంటి ఓ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది. అదే ఓయ్.

  • Published Feb 09, 2024 | 6:17 PMUpdated Feb 09, 2024 | 6:17 PM
ఓయ్ మూవీలో నటించిన ఈ పాప.. ఇప్పుడు చూస్తే నమ్మలేరు

దర్శకులు రిప్లై ఇవ్వరనుకున్నారో లేక తన కామెంట్ పట్టించుకోరో అనుకున్నారో తెలియదు కానీ ఓ నెటిజన్..‘ఓరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావ్ రా’ అంటూ ఓ డైరెక్టర్‌ను ఉద్దేశించి ప్రేమగా కామెంట్ చేశాడు. దానికి వెంటనే ఆ దర్శకుడు స్మైల్ ఎమోజీని పోస్టు చేశాడు. దీంతో ఎప్పుడో ఆఫ్ లైన్‌లో ఉన్న డైరెక్టర్ ఒక్కసారిగా ట్రెండ్ అయ్యాడు. అతడు ఎవరో కాదూ ఓయ్ మూవీ దర్శకుడు ఆనంద్ రంగా. అప్పట్లో ఈ మూవీ అంత పెద్ద హిట్ కాలేదు కానీ..ఇప్పట్లో ఫీల్ గుడ్ మూవీగా నిలిచిపోయింది. థియేటర్లలో కన్నా..బుల్లితెరపై ఈ మూవీ మంచి ఆదరణ చూరగొంది. అయితే ఇప్పుడు ఈ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్ ఆనంద్ ఓయ్ మూవీని వాలంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రీ రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించాడు. అంతే ఈ సినిమాను బాగా లవ్ చేసిన ఓ నెటిజన్.. గుండు నాయాలా అంటూ కామెంట్ చేయడం.. దానికి ఆయన రిప్లై ఇవ్వడం.. వెంటనే ఆ నెటిజన్ సారీ చెప్పడం.. పర్వాలేదు.. మీరుఅన్నది నిజమే కదా అంటూ సమాధానం ఇవ్వడంతో డైరెక్టర్ మరోసారి లైమ్ లైట్‌లోకి వచ్చినట్లు అయ్యింది. ఇక ఈ మూవీ విషయానికి వస్తే..2009లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేదు కానీ.. ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఆదరించారు టీవీల్లో. ఈ మూవీకి యువన్ శంక్ రాజా మ్యూజిక్ అందించగా.. ప్రతి పాట సూపర్ డూపర్ హిట్.

సిద్ధార్థ్, షామిలీ హీరో హీరోయిన్లు. బేబి షామిలి హీరోయిన్ గా మారి.. తెలుగులో ఓయ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది క్యూట్ గర్ల్. ఇందులో షామిలి దగ్గర ముగ్గురు చిన్నారులు ఉంటారు కదా.. అందులో చివరి పిల్ల.. షామిలి గురించి సిద్దార్థ్‌కు హింట్ ఇస్తూ ఉంటుంది. ఓ సన్నివేశంలో హీరో ఆమె దగ్గర కూర్చొని నువ్వు గ్రోనప్ గర్ల్ అనగానే ‘ కదా.. నా పేరు శ్రీలక్ష్మి’ అంటూ టక టకా మొత్తం వివరాలు చెబుతుంది. ఇప్పుడు ఆ పిల్ల ఎలా ఉందో తెలుసా..? ఇప్పుడు చాలా నిజంగానే గ్రోనప్ గర్ల్. ఇప్పుడు ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలుస్తుండటంతో.. ఈ అమ్మాయి కూడా ట్రెండ్ అవుతోంది. అయితే నిజంగానే ఆమె అంటే నమ్మలేరు.

ఓయ్ మూవీలోని తన సీన్‌ను పంచుకున్న ఆమె అది నేనే అంటూ పేర్కొంది. అయితే ఆమె నాట్య మయూరి అనే ఇన్ స్టా ఫేజ్‌లో ఈ వివరాలు పంచుకుంది. ఇది ఆమె అఫీషియల్ ఐడి. ఆమె పేరు నందిని అని సమాచారం. ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్. దానికి సంబంధించిన పిక్స్ ఎక్కువగా అందులో కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు పంచుకున్నప్పుడు కొంత మంది నెగిటివ్ గా స్పందిస్తే.. మరికొంత మంది పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఓయ్ మూవీ ద్వారా ఇద్దరు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by natya mayuri (@natya_mayuri__)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet