iDreamPost
android-app
ios-app

ఈ పాప సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

  • Published Feb 05, 2024 | 7:32 PM Updated Updated Feb 05, 2024 | 7:32 PM

చిరునవ్వులు ఒలికిస్తూ.. ఫోటోకు ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేస్తుంది. ఆమె సినిమా ఒప్పుకుంటేనే ఓ సెన్సేషన్. ఇంతకు ఆమె ఎవరంటే..?

చిరునవ్వులు ఒలికిస్తూ.. ఫోటోకు ఫోజులు ఇస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏలేస్తుంది. ఆమె సినిమా ఒప్పుకుంటేనే ఓ సెన్సేషన్. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Feb 05, 2024 | 7:32 PMUpdated Feb 05, 2024 | 7:32 PM
ఈ పాప సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్.. గుర్తు పట్టారా..?

కొంత మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే ఫిదా చేసేస్తుంటారు. అబ్బాయిలనే కాదూ.. అమ్మాయిలను కూడా తమ నటనతో పడేస్తుంటారు. కేవలం నటన పరంగానే కాకుండా తెరపై వారి స్క్రీన్ ప్రజెన్స్ చూసి కూడా ఇష్టపడుతుంటారు ప్రేక్షకులు. అలాంటి హీరోయిన్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా అరుదుగా దొరుకుతుంటారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించడమంటే మామూలు విషయం కాదూ. ఏ మాత్రం అతి చేసినా.. రిజెక్ట్ చేసేస్తారు టాలీవుడ్ వీక్షకులు. అదే నచ్చితే.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఏం చేసిందిరా బాబు అంటూ ఓన్ చేసుకుంటున్నారు. ఇక తమ ఇంటి ఆడపడుచు లెక్క ట్రీట్ చేస్తుంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని చూశారు కదా.. ఫస్ట్ మూవీతోనే తెలుగు పిల్లగా మారిపోయింది.

ఇంతకు ఆ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. మాటలతో కాదూ..తన చిరునవ్వుతోనే కుర్రకారు హృదయాలను మీటేసింది. ఆమె సినిమా చేస్తుందంటే.. సంథింగ్ స్పెషల్, కచ్చితంగా చూడాల్సిన మూవీగా పేరొచ్చింది. హిట్స్, ప్లాప్స్ పక్కన బెడితే.. ది బెస్ట్ మూవీస్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇంతకు ఆమె ఎవరంటే. ద గార్జియస్, బ్యూటీఫుల్ స్మైల్, డ్యాన్స్ క్వీన్, హైబ్రిడ్ పిల్ల ద వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి. కథ నచ్చితేనే సినిమాలు చేయడం ఆమె నైజం. ఈ విషయం మూవీ లవర్స్‌కు తెలుసు. మంచి కథలను ఎంచుకుంటూ.. ఆచి తూచి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ క్యూటీ. సినిమాల్లో అడుగుపెట్టక ముందే తెలుగు రియాలిటీ షో ఢీలో మెప్పించింది. అలాగే చైల్డ్ ఆర్టిస్టుగా కూడా మెరిసింది అమ్మడు.

did you find this heroine

మలయాళ సినిమాల్లో ప్రభంజనం సృష్టించిన మూవీ ప్రేమమ్. ఇందులో మలార్ పాత్రలో మాలీవుడ్‌లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. కాళి (తెలుగులో హే పిల్లగాడ) చేసింది. మహిళా ప్రాధాన్యమున్న కథలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల కళ్లల్లో పడిన ఆమె.. తొలి సినిమా ఫిదాతో మైండ్ బ్లాక్ చేసేసింది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలే చెబుతాయి ఆమె ఎటువంటి నటే. తెలుగు, తమిళ్, మలయాళ ఇండస్ట్రీలో ఆమెకున్న క్రేజే వేరు. అబ్బాయిలే కాదూ..అమ్మాయిల్లో కూడా ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇక నటిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమెను ఇష్టపడుతుంటారు.

బయటకు వస్తూనే హుందాగా వ్యవహరిస్తూ, చక్కనైన వస్త్రధారణతో అలరిస్తూ ఉంటుంది.  దుస్తులకే వన్నె తెచ్చే బ్యూటీల్లో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటుంది. 2015లో కెరీర్ స్టార్ చేసినప్పటికీ.. ఆమె చేసింది కేవలం పట్టుమని 15 సినిమాలు కూడా చేయలేదు. మలయాళంలో అధిరన్ సినిమాలో ఆమె యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. క్యారెక్టర్ కొత్తగా ఉంటే..రెమ్యురేషన్ కూడా లెక్కచేయని హీరోయిన్ సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె తండేల్ చేస్తుంది. తమిళంలో శివకార్తికేయన్ సినిమా ఓకే చేసింది. అలాగే ఇప్పుడు హిందీలో కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెమలి అలియాస్ సాయి పల్లవి నటించిన మూవీస్ లో ఏదీ మీకు బాగా ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet