Keerthi
లేడి సూపర్ స్టార్ సాయిపల్లవికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. మంచి వ్యక్తిత్వం, ఆద్భుతమైన టాలెంట్ కలిగిన సాయి పల్లవి పై ఏదో కుట్ర జరుగుతోందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..
లేడి సూపర్ స్టార్ సాయిపల్లవికి ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. మంచి వ్యక్తిత్వం, ఆద్భుతమైన టాలెంట్ కలిగిన సాయి పల్లవి పై ఏదో కుట్ర జరుగుతోందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..
Keerthi
హీరోయిన్ సాయి పల్లవి. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. తన ఆద్భుతమైన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచేసింది సాయి పల్లవి. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. ఆ తర్వాత వరుస ఆవకాశాలను అందుకుంటూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే కథల ఎంపిక పరంగా సాయి పల్లవి అచి తూచి అడుగు వేస్తుంది. ఒకసారి కథలో పాత్ర నచ్చకపోతే అవతల ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సరే సినిమాలో నటించనని కుండబద్దలు కొడుతూ చెప్తుంది. ఇక గ్లామర్ షో చేసే పాత్రలకు అయితే చాలా దూరంగా ఉంటుంది. మరి ఇంత అనుకువుగా టాలెంటెడ్ గా ఉన్న సాయి పల్లవి పై ఏదో కుట్ర జరుగుతోందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే..
లేడి సూపర్ స్టార్ సాయిపల్లవి ఏదైనా ఒక పాత్ర ను ఒప్పుకుందంటే.. అందులో నటించింది అనడం కన్నా, జీవించింది అనడం మేలు. అంతలా తన నేచరల్ నటనతో.. కో స్టార్ లకు పోటీగా నటిస్తుంది. మరి అంత టాలెంట్ ఉన్నా సాయిపల్లవి పై ఇండస్ట్రీలో ఏదో తెలియని కుట్ర జరుగుతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే.. ఇటీవలే సాయి పల్లవి నితిష్ తివారీ రామాయణం సినిమాలో నటిస్తుందనే విషయం తెలిసిందే. అయితే.. అందులో సాయిపల్లవిని సీత పాత్ర నుంచి తొలగించారని, ఆ స్థానంలో సాయిపల్లవికి బదులుగా జాన్వీ కపూర్ కి ఆఫర్ చేశారని బాలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది. అయితే ఈ కథనాల్లో ఎంతవరకు వాస్తవం లేదని తాజాగా తేలింది. అవన్నీ కేవలం ఊహాగానాలేనని రుజువైంది.
అలాగే అందం, తెలివి తేటలు ఎన్ని ఉన్నా సాయి పల్లవి స్థానంలో.. జాన్వీ ఎప్పటికీ రీప్లేస్ మెంట్ కాలేదు. పైగా సాయి పల్లవి, నటన, ట్యాలెంట్ మీద ఎవరైనా దిగుదుడుపే. ఈ విషయంలో సీనియర్ దర్శకుడు నితీష్ తివారీ పూర్తి క్లారిటీతో ఉన్నారు. అంతేకాకుండా.. సీత పాత్రలో సాయిపల్లవి అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలరని ఆయన భావిస్తున్నారట. కాగా, సాయి పల్లవి సీత పాత్రను తొలిగిస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను అస్సలు నమ్మవద్దని కూడా చెబుతున్నారట. మరి, ఏది ఏమైనా సీతా పాత్రలో సాయి పల్లవి అయితేనే చాలా బాగుంటుంది. ఆ పాత్రలో ఒదిగి న్యాయం చేస్తుందని ఆమె ఫ్యాన్స్ కూడా సాయి పల్లవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఇండస్ట్రీలో సాయి పల్లవి పై కుట్ర జరుగుతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.