iDreamPost
android-app
ios-app

500 కోట్ల ఆదిపురుష్ కన్నా.. 30 కోట్లతో తీసిన హనుమాన్ బాగుండటానికి కారణం?

HanuMan Vs Adipurush.. సంక్రాంతి బరిలోకి దిగిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విజయంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్. ఆయన్ను ట్రోల్స్ చేస్తున్నారు.. ఎందుకంటే.?

HanuMan Vs Adipurush.. సంక్రాంతి బరిలోకి దిగిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విజయంతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్. ఆయన్ను ట్రోల్స్ చేస్తున్నారు.. ఎందుకంటే.?

500 కోట్ల ఆదిపురుష్ కన్నా.. 30 కోట్లతో తీసిన హనుమాన్ బాగుండటానికి కారణం?

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన మూవీ హనుమాన్. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన హనుమాన్ .. భారీ అంచనాల మధ్య జనవరి 12న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేసింది. పాజిటివ్ వైబ్స్‌తో మంచి హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. వీరి కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం ఇది. అంతక ముందు జాంబి రెడ్డి, అద్భుతం అనే సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు పురాణ, ఇతి హాసాల్లోని ఓ సూపర్ హీరో కథను స్క్రీన్ పైకి తీసుకు వచ్చాడు ప్రశాంత్.  హనుమాన్ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు.. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

హనుమాన్, ఆదిపురుష్ సినిమాలను కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. హనుమాన్ సినిమా రామాయణ ఘట్టంలోనిది కాదూ. కేవలం ఆంజనేయ స్వామికి ఉన్న పవర్స్.. ఓ వ్యక్తికి వస్తే ఎలా సూపర్ హీరోగా మారాడన్నదే కథ. ఇందులో తేజ సజ్జాకు హనుమంతుడి శక్తులు వస్తాయి. అయితే ఈ అంజని పుత్రుడు ఎంతటి శక్తిశాలే అందరికీ తెలిసిందే. ఇతి హాసాలను అవపోసన పట్టిన వారే కాదూ.. పాత రామాయణ, మహా భారత సినిమాలు, టీవీ సిరీస్ చూసిన వారు సైతం.. ఆంజనేయుడికి ఉన్న బలాలు, శక్తులు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రాముడికి అపర భక్తుడైన ఆయన.. అతడి మాటను వేద వాక్కుగా భావిస్తాడు. నీ అంతటి వాడు లేడు ఆంజనేయా అంటే..అసంభవం అన్న కార్యాన్ని సైతం చేసుకొస్తాడు.

Aadhipurush vs Hanuman movie

మరీ ఆయన పవర్స్ వచ్చిన వ్యక్తి కూడా.. అలాగే ఉంటాడు కదా. ఇదే విషయాన్ని తెరపైకి ఎక్కించడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు హనుమాన్ మూవీ కెప్టెన్ ప్రశాంత్. అతడు ఎంతటి శక్తిశాలో ఈ మూవీ ద్వారా మరోసారి ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చేశాడు. ఇది కదా సినిమా తీయడం అంటే..అని ప్రశాంత్, తేజలను కొనియాడుతూనే ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ఏకిపారేస్తున్నారు. ఆదిపురుష్ అంటూ ప్రభాస్‌తో మూవీని తెరకెక్కించాడు ఓం రౌత్. రూ. 550 కోట్ల పెట్టి సినిమా తీశాడు. అదీ కూడా రామాయణంలోని ఓ ఘట్టాన్ని. కానీ ఇతిహాస గాధలపై ఎలాంటి అవగాహన లేకుండా సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులపై బాణాన్ని వదిలాడు. ఈ సినిమాను చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు. వీఎఫ్ఎక్స్ కానీ, సీజీ వర్క్ కానీ సెట్ కాలేదు. అదంతా పక్కన పెడితే.. క్యారెక్టర్స్ బిల్డ్ చేసిన విధానం కూడా పేలవంగా ఉంది.

Aadhipurush vs Hanuman movie

రామాయణ గాధను తీసేటప్పుడు.. కనీస జ్ఞానం అవసరం. కానీ అవేమీ లేనట్లుగా కనిపించింది ఈ సినిమాలో. ముఖ్యంగా ఆంజనేయ స్వామి పాత్రధారికి ఇచ్చిన డైలాగ్స్, ప్రభాస్‌ను రాముడిగా చూపించిన విధానం.. రావణాసురుడి కాస్ట్యూమ్స్, ఇతర పాత్రధారుల తీరు తెన్నులు..మూవీని విమర్శలు పాలయ్యేలా చేశాయి.  హనుమాన్ మూవీ బడ్జెట్ కేవలం 30 కోట్లలోపే. కానీ బజరంగబలికి ఉన్న శక్తులను..సామాన్యుడికి వస్తే.. ఎలా ఉంటాయో చూపించాడు. హనుమంతుడి బలం, వాయు వేగం, దేన్నైనా సాధించి తెచ్చేగల ధైర్య సాహసాలను ప్రతి సీనులోనూ మిస్ కాకుండా చూపించాడు ప్రశాంత్ వర్మ. సీజీ వర్క్, వీఎఫ్ఎక్స్ విషయంలో పిన్ టు పిన్ చిన్న అంశాన్నికూడా వదలకుండా..స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు. ఇతిహాసాలు గాధలను తీయడం గొప్ప కాదూ.. పొంతన లేకుండా సినిమాలు తెరకెక్కించడం మంచిది కాదంటూ సూచిస్తున్నారు. ఆది పురుష్ విడుదలై.. ఆరు నెలలు అయిపోయినా.. హనుమాన్ మూవీతో ట్రోల్స్ గురౌతున్నాడు ఓం రౌత్. తెలుగోడి సత్తా మరోసారి బాలీవుడ్ కు చూపించిన  ప్రశాంత్ డైరెక్షన్, ఈ రెండు సినిమాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.