Krishna Kowshik
తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది. ఇక్కడే కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ లేదా కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు నటీమణులు. టాలీవుడ్ లో నటన నేర్చుకుని.. ఆ తర్వాత మరో ఇండస్ట్రీకి వెళ్లి.. బిజీ నటిగా మారిపోతున్నారు. ఆ కోవలోకే వస్తోంది ఈ బ్యూటీ.
తెలుగు ఇండస్ట్రీ ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చింది. ఇక్కడే కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ లేదా కోలీవుడ్, మాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు నటీమణులు. టాలీవుడ్ లో నటన నేర్చుకుని.. ఆ తర్వాత మరో ఇండస్ట్రీకి వెళ్లి.. బిజీ నటిగా మారిపోతున్నారు. ఆ కోవలోకే వస్తోంది ఈ బ్యూటీ.
Krishna Kowshik
బాలీవుడ్ సీతాకోక చిలుకలు అనేకం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. తమ అందచందాలతో అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ కూడా అలాంటి నటే. పవన్ కళ్యాణ్ హీరోగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా చాలా మందే చూసే ఉంటారు. 1999లో విడుదలైన ఈ మూవీలో ఇద్దరు హిందీ భామలు నటించారు. అందులో హీరోయిన్‌గా నటించిన నటి ప్రీతి జింగానియా అందరి మదిలో గుర్తుండిపోతుంది. అందులో డౌటే లేదు. కానీ హీరోయిన్ కన్నా ఫేమస్ అయ్యింది మాత్రం మన సెకండ్ హీరోయిన్ అదితి గోవిత్రికర్. ఈ పేరు చెబితే గుర్తుండకపోవచ్చు.. లవ్లీ పాత్రలో వావ్ అనిపించింది. మోడల్ కాలేజీ అమ్మాయిగా కనిపిస్తోంది ఇందులో అదితి.
గవర్నమెంట్ కాలేజీ అబ్బాయి, జులాయి కుర్రాడిగా కనిపిస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆమెను తన మాయ మాటలతో వలలో వేసుకుంటారు. ’హే పిల్ల నీ పేరు లవ్లీ.. జారి పోకే చేపల్లే తుళ్లి‘ అంటూ ఆమె ప్రేమ కోసం తపిస్తాడు మన హీరో. తర్వాత అతడి నిజ స్వరూపం తెలిసి ఛీ కొడుతుంది మన లవ్లీ. ఆ లవ్లీ ఒరిజినల్ పేరు అదితి గోవిత్రికర్. ఈ మూవీ వచ్చి.. 25 ఏళ్లకు దగ్గరతౌంది. ఈ మూవీ చూస్తే ఈ అమ్మాయి కచ్చితంగా ఇండియన్ అయితే అనుకోరు.. ఫారెన్ బ్యూటీ అనుకుంటారు. ఇందులో ఆమె పార్ష్ గర్ల్ పాత్రలో మెప్పిస్తుంది. ఇప్పుడు ఆమెను చూస్తే మాత్రం నిజంగా విస్మయానికి గురౌతారు. ఇప్పటికీ అదే అందాన్ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఆమె నటే కాదూ.. డాక్టర్ కూడా. ఈ విషయం చాలా మందికి తెలియదు.
అదితి మల్టీ టాలెంటర్ కూడా. ముంబయిలో పుట్టిన అమ్మడు.. డాక్టర్ విద్యను అభ్యసించారు. గైనకాలజీలో ఎంఎస్ చేశారు. అయితే ఇండస్ట్రీపై ఇంట్రస్టుతో మోడల్ గా అవతారం ఎత్తారు. కోకాకోలా, పాండ్స్ వంటి ప్రముఖ యాడ్స్‌లో నటించారు. ఆమె తొలి సినిమా తెలుగు కావడం విశేషం. తమ్ముడు మూవీతోనే ఆమె సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చింది. మౌనమేలనోయిలో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడారు. ఆ సమయంలోనే ఆమెకు వివాహం అయ్యింది. సినిమాల్లో చేస్తూనే.. మిసెస్ ఇండియా పోటీలకు వెళ్లారు. టైటిల్ విన్ అయ్యారు. మిసెస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ గెలిచిన తొలి మహిళ ఆమె కావడం విశేషం. ఆతర్వాత బాలీవుడ్ మూవీస్ మాత్రమే చేశారు.
అడపాదడపా ఇతర భాషల్లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్‌గా మారిపోయారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పలు విషయాలను పంచుకుంటారు. ఆమె సైకాలజిస్ట్ కూడా. పలువురికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. ప్రముఖులతో సెషన్లు కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలు వెల్లడించారు. దీంతో ఆమె మరోసారి లైమ్ టైల్‌లోకి వచ్చింది. గతంలో తనకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంది. మరీ ఈ లవ్లీ పర్సన్ గురించి మీ అభిప్రాయమేమిటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.