iDreamPost
android-app
ios-app

ఈ సర్కిల్‍లోని చిన్నారి.. టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడిపాడింది.. ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jan 23, 2024 | 3:52 PM Updated Updated Jan 23, 2024 | 3:52 PM

చిన్న పిల్లల మధ్యలో నిల్చొని.. రెండు జడలతో, నుదిటిన తిలకంతో ఉన్న ఈ పాప (సర్కిల్ చేసిన పాప) ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడి పాడిన ఈ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి

చిన్న పిల్లల మధ్యలో నిల్చొని.. రెండు జడలతో, నుదిటిన తిలకంతో ఉన్న ఈ పాప (సర్కిల్ చేసిన పాప) ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడి పాడిన ఈ బ్యూటీ.. ఎవరో చెప్పుకోండి

  • Published Jan 23, 2024 | 3:52 PMUpdated Jan 23, 2024 | 3:52 PM
ఈ సర్కిల్‍లోని చిన్నారి.. టాలీవుడ్ టాప్ హీరోలతో ఆడిపాడింది.. ఎవరో గుర్తుపట్టారా..?

అన్ని దశల్లో అందమైనది బాల్యదశ. చిన్నతనంలో చేసే అల్లరి, ఆట పాటలు, అమ్మచేతి గోరు ముద్ద, ఆమె చేతిలోనే తన్నులు తినడాలు, నాన్న జేబులోని డబ్బులు కొట్టేయడాలు ఎప్పటికీ మధుర స్మృతులే. ఇక చిన్ననాటి స్నేహాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాల్యంలో మనకు లభించిన స్వచ్ఛమైన బంధం స్నేహం మాత్రమే. స్కూల్లో తరగతి క్లాసులు పెరుగుతున్న కొద్దీ..ఆ స్నేహా బంధం కూడా బలంగా తయారవుతూ ఉంటుంది. క్లాస్ పూర్తవ్వగానే..ఆ తరగతిలోని విద్యార్థులంతా కలిసి టీచర్ ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలను తీసుకుని దాచుకోవడం చేస్తుంటారు. కాలం ముందుకెళ్లేకొద్ది  మన దగ్గర మిగిలిపోయే అందమైన బాల్య స్మృతుల్లో ఇవి కూడా ఉంటాయి.

ఇదిగో ఈ ఫోటో చూస్తుంటే.. మీకు చిన్ననాటి స్మృతులు గుర్తుకు వస్తున్నాయా. ఈ ఫోటో మాత్రం ప్రముఖ నటీమణిది. ఈ పిక్చర్ లో పిల్లల మధ్య నిలబడి ఉన్న అమ్మాయిని చూశారా.. నుదుటిన చుక్కను పెట్టుకుని, రెండు జడలు వేసుకున్న ఈ సర్కిల్‌లో ఉన్న పాప ఒకప్పటి స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. ఆమె ఎవరో గుర్తు పట్టారా..? పోనీ చిన్న క్లూ.. ఆమె సినిమాలో చెప్పే ఓ స్టోరీ.. నిజ జీవితంలో నిజమైంది. అదే ఆమె లైఫ్ టర్నింగ్ అయ్యేలా చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. కేరళ కుట్టి ఆసిన్ తొట్టుంకల్. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఆ తర్వాత టాప్ హీరోలతో ఆడి పాడింది. నాగ్‌తో శివమణి, బాలయ్యతో లక్ష్మి నరసింహ, వెంకీతో ఘర్షణ, ప్రభాస్‌తో చక్రం, అన్నవరంలో పవన్ కళ్యాణ్‌తో ఆడి పాడింది. అప్పటికే తమిళనాట ఫుల్ బిజీగా మారిపోయింది అమ్మడు. బీటౌన్ కు కూడా వెళ్లి సత్తా చాటింది. కానీ మనకు ఆసిన్ అనగానే.. గజిని పాత్రలో కల్పన క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది.  గజినీ సినిమాలో ఓ మొబైల్ కంపెనీ ఓనర్ సంజయ్ రామ స్వామితో పరిచయం ఏర్పడినట్లు..అతడి ప్రేమలో ఉన్నట్లు హీరోకు కట్టుకథ అల్లి చెబుతుంది. కానీ నిజ జీవితంలో కూడా ఆమె మొబైల్ కంపెనీ మైక్రో మాక్స్ సహా వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమించి.. వివాహం చేసుకుంది.

పెళ్లయ్యాక సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఆరిన్ అనే కూతురు ఉంది. ఆసిన్ మల్టీ టాలెంట్. ఆమెకు  సుమారు ఏడు భాషలు వచ్చు. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు వచ్చు. వీటితో పాటు మరాఠి కూడా తెలుసు. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్నారు.. మరీ మన మన ఆసిన్ కూడా వస్తుందేమో చూడాలి. ఆసిన్ మళ్లీ తెరపై కనిపించాలని అనుకుంటున్నట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet