ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సలార్, డుంకి రెండు ఆడియన్స్ కి బాగా కావాల్సిన సినిమాలే. ఈ రెండు సినిమాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రేసులోకి సలార్, డుంకిలకు పోటీగా హాలీవుడ్ 'ఆక్వామెన్' మూవీ అనౌన్స్ చేశారు..
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సలార్, డుంకి రెండు ఆడియన్స్ కి బాగా కావాల్సిన సినిమాలే. ఈ రెండు సినిమాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రేసులోకి సలార్, డుంకిలకు పోటీగా హాలీవుడ్ 'ఆక్వామెన్' మూవీ అనౌన్స్ చేశారు..
బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీస్ ఒకేసారి క్లాష్ అవుతున్నాయంటే.. ఫ్యాన్స్ చేసే హంగామా ఓవైపు.. సినిమాల ఫలితాల గురించి టెన్షన్ ఓవైపు కనిపిస్తుంటాయి. అందులోనూ పాన్ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆయా సినిమాలకు థియేటర్స్ కొరత ఉండకూడదని కోరుకుంటారు. ఎందుకంటే.. బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు టాక్ పరంగానే కాదు.. ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎక్కువ పోరాడాల్సి ఉంటుంది. అదే ఫస్ట్ డే ఓపెనింగ్స్ సాలిడ్ గా నమోదు అయ్యాయంటే.. టాక్ బట్టి మిగతా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు బిగ్ స్టార్స్ నటించిన బిగ్ బడ్జెట్ మూవీస్ ఒకేసారి బాక్సాఫీస్ పోటీకి దిగుతున్నాయి. ఆ సినిమాలేవో కాదు.. డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్.. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన డుంకి. ఈ రెండు సినిమాలకు ఉన్న బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సలార్ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. డుంకి మూవీని లెజెండరి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని రూపొందిస్తున్నారు. అయితే.. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది క్రిస్మస్ ని టార్గెట్ చేస్తూ.. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీటిలో చిన్న మార్పు చేశారు మేకర్స్.
అదేంటంటే.. సలార్, డుంకి రెండు ఆడియన్స్ కి బాగా కావాల్సిన సినిమాలే. అంటే.. ఈ రెండు సినిమాల కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ఇందులో సలార్ కోసమైతే అసలు చెప్పుకునే పని లేదు. ఎందుకంటే.. సలార్ సినిమాకి ఉన్న హైప్ ఇప్పుడు ఏ సినిమాకు లేదు. అయితే.. డుంకి కూడా షారుఖ్ – రాజ్ కుమార్ హిరానిల సినిమా కాబట్టి.. ఆ స్థాయి బజ్ ఏర్పడింది. అయితే.. రెండు సినిమాలు ఒకేసారి వస్తే ఓపెనింగ్స్ లో నెంబర్స్ తగ్గే అవకాశం ఉందని.. షారుఖ్ డుంకి సినిమాని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఒకరోజు తేడాతో రిలీజ్ అయినా.. ఈ రెండింటికి బాక్సాఫీస్ వార్ అయితే తప్పేలా లేదు. అసలు థియేటర్స్ పరంగా ఎలాంటి క్లాష్ ఏర్పడుతుందో ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేకపోతున్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు క్రిస్మస్ రేసులోకి సలార్, డుంకిలకు పోటీగా హాలీవుడ్ ‘ఆక్వామెన్’ మూవీ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది. కాకపోతే.. ఆక్వామెన్ రావడం ఇండియా వరకు ఇబ్బంది కాదు. ఎందుకంటే.. అందరు సలార్, డుంకి తర్వాత ఆ సినిమాకి ప్రిఫెరెన్సు ఇస్తారు. కానీ.. ప్రాబ్లెమ్ ఏంటంటే.. ఓవర్సీస్ మార్కెట్. సలార్ ల, డుంకి సినిమాలకు ఓవర్సీస్ లో బిగ్ రేంజ్ టార్గెట్స్ సెట్ కానున్నాయి. ఇలాంటి తరుణంలో సడన్ గా ‘ఆక్వామెన్ లాస్ట్ కింగడమ్’ వస్తుందని తెలిసి ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. అందుకు కారణం.. ఓవర్సీస్ లో థియేటర్స్ అన్ని ఆక్వామెన్ కి కేటాయించే అవకాశం ఉంది. ఆ విధంగా అక్కడ సలార్, డుంకి మూవీస్ కి ఓపెనింగ్స్ నుండే దెబ్బపడే అవకాశం లేకపోలేదు. అలా ఆక్వామెన్ సలార్, డుంకిలను టెన్షన్ లో పడేసిందని సినీ వర్గాల టాక్. మరి సలార్, డుంకిలపై ఆక్వామెన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో కామెంట్స్ లో తెలపండి.