iDreamPost
android-app
ios-app

తెలుగులో ఇండస్ట్రీ హిట్ తో డెబ్యూ.. అలా మిస్ అయ్యిందట!

  • Author ajaykrishna Updated - 06:05 PM, Mon - 25 September 23
  • Author ajaykrishna Updated - 06:05 PM, Mon - 25 September 23
తెలుగులో ఇండస్ట్రీ హిట్ తో డెబ్యూ.. అలా మిస్ అయ్యిందట!

ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా వస్తాయో.. ఎలా మిస్ అవుతుంటాయో.. అభిమానులు, ప్రేక్షకులకు ఆయా సెలబ్రిటీలు చెబితే గానీ తెలియదు. కొన్నిసార్లు అయ్యో మిస్ అయ్యిందని అనిపించినా.. ఇంకొన్నిసార్లు అప్పుడే చేసుంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ.. టైమ్ మిస్ అయితే అవకాశాలు మళ్లీ రావుగా.. కంగనా టాలీవుడ్ డెబ్యూ విషయంలో అలాంటిదే జరిగిందట. ఈ విషయాన్నీ స్వయంగా కంగనా చెప్పడం విశేషం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పాపులర్ అయిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఈ భామ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డులు అందుకొని ఆదర్శంగా నిలిచింది.

కెరీర్ ఆరంభంలో కొన్నాళ్ళు రొమాన్స్, గ్లామర్ రోల్స్ చేసిన ఈ భామ.. ఒకానొక దశలో తన పంథా మార్చేసి స్టోరీస్ ఆధారంగా సినిమాలు చేయడం ప్రారంభించింది. దీంతో వరుస హిట్స్.. అవార్డులు క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోయిన్ ఓ రేంజ్ కి ఎదిగి.. నటిగా తనను ఎవరు అందుకోలేరని ప్రూవ్ చేసుకుంది. బాలీవుడ్ లో కంగనా సెటిల్ అయిపోయింది. కానీ.. సౌత్ లోనే అమ్మడికి అదృష్టం దోబూచులాడుతుంది. ఆరంభంలో తెలుగు, తమిళ సినిమాలలో ట్రై చేసినప్పటికి హిట్స్ రాలేదు. దీంతో మళ్ళీ ఎక్కడ కెరీర్ ఆరంభించిందో అక్కడికే వెళ్ళిపోయింది. అనుకున్నట్లుగా బాలీవుడ్ లో అందరు స్టార్స్ సరసన సూపర్ హిట్స్ చేసి ఫేమ్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. తెలుగులో కంగనా ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబో మూవీ ‘ఏక్ నిరంజన్’తో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ సినిమాకు ముందే కంగనా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ తో డెబ్యూ చేయాల్సిందట. అది ఏ సినిమా అనుకుంటున్నారా.. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ మూవీ. ఆ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. కానీ.. ఇలియానాకి ముందు కంగనాని కలిసి ఓకే చేసేసాడట పూరి. కానీ.. అప్పటికే కంగనా హిందీలో ‘గ్యాంగ్ స్టర్’ మూవీ ఓకే చేయడంతో పోకిరి వదులుకుందట. అలా.. పోకిరి మిస్ అయినా.. తర్వాత ఏక్ నిరంజన్ సినిమాతో మళ్ళీ పూరినే కంగనాని తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ విధంగా కంగనా ఇండస్ట్రీ హిట్ తో డెబ్యూ చేయాల్సిన అవకాశం మిస్ చేసుకుందిట. మరి కంగనా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss