Aditya N
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ “విశ్వంభర”.టైటిల్ రివీల్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ద్వారా, ఈ సినిమాలో ఆసక్తికరమైన ఎన్నో అంశాలతో తెరకెక్కనున్న ఫాంటసీ యాక్షన్ సినిమా అని చెప్పకనే చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ “విశ్వంభర”.టైటిల్ రివీల్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ద్వారా, ఈ సినిమాలో ఆసక్తికరమైన ఎన్నో అంశాలతో తెరకెక్కనున్న ఫాంటసీ యాక్షన్ సినిమా అని చెప్పకనే చెప్పారు.
Aditya N
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ ఫాంటసీ ప్రాజెక్ట్ “విశ్వంభర”. ఈ సినిమాని జనవరి 10, 2025న విడుదల అవుతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. అందుకే షూటింగ్ సమయంలో విరామం తీసుకోకుండా చిత్ర యూనిట్ సభ్యులు పని చేస్తున్నారు. టైటిల్ రివీల్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ద్వారా, ఈ సినిమాలో ఆసక్తికరమైన ఎన్నో అంశాలతో తెరకెక్కనున్న ఫాంటసీ యాక్షన్ సినిమా అని చెప్పకనే చెప్పారు. తాజాగా ఈ సినిమాలో హైలైట్ గా నిలవనున్న ఒక యాక్షన్ సీక్వెన్స్ గురించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది.
ప్రస్తుతం మెగాస్టార్ తో రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన ఫారెస్ట్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్‌లో మెగాస్టార్ చిరంజీవి షూట్ కోసం బాడీ డబుల్ కూడా ఉపయోగించలేదట. కాగా దుమ్ము, బురద నీటిలో ఈ ఫైట్ జరుగుతుందట. అందుకే చిరంజీవితో సహా ఇతర ఫైటర్లు కూడా పూర్తిగా తడి బురదతో కప్పబడి ఉంటారని తెలుస్తోంది. ఈ ఫైట్ లో ఎలాంటి పొరపాటు దొర్లకుండా సహజంగా ఉండటం కోసం నిజమైన ఇసుక మట్టిని ఉపయోగించారట. అలా నిజమైన మట్టిలో ఫైట్ అంటే నిజానికి నటీనటులకు, ఫైటర్‌లకు ఇబ్బంది కలిగినా… సరైన అవుట్ పుట్ కోసం ఎంత కష్టమైనా సరే పని చేయటంలో విశ్వంభర చిత్ర బృందం ఏమాత్రం తగ్గటం లేదు.
ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బురద మట్టిలో సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చిందని, సినిమా మొత్తానికే ఇది హైలైట్ గా నిలుస్తుందని గట్టి టాక్ వినిపిస్తుంది. తొలి చిత్రం బింబిసారతోనే ఫాంటసీ కాన్సెప్ట్ ను హ్యాండిల్ చేయడంలో ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభరలో అద్భుతమైన కంప్యూటర్ గ్రాఫిక్స్, కళ్ళు చెదిరే విజువల్స్ కలిసి చిరంజీవి కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా నిలుస్తుందని చెప్తున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమా అంచనాలను అందుకుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేయడం ఏమీ కష్టం కాదనే చెప్పాలి.