iDreamPost
android-app
ios-app

Thandel : తండేల్ ఓవర్సీస్ బిజినెస్ కాస్త గట్టిగానే! సాయిపల్లవి ఎఫెక్ట్?

  • Published Feb 27, 2024 | 4:51 PM Updated Updated Feb 27, 2024 | 4:51 PM

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో నాగ చైతన్య. ఇప్పటికే ఈ హీరో నటిస్తున్న తండేల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో సినిమాలతో బిజీగా ఉన్న హీరో నాగ చైతన్య. ఇప్పటికే ఈ హీరో నటిస్తున్న తండేల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తోంది.

  • Published Feb 27, 2024 | 4:51 PMUpdated Feb 27, 2024 | 4:51 PM
Thandel : తండేల్ ఓవర్సీస్ బిజినెస్ కాస్త గట్టిగానే! సాయిపల్లవి ఎఫెక్ట్?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా “తండేల్”. గీతా ఆర్ట్స్ 2బ్యానర్ లో.. బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు మరోసారి నటి సాయి పల్లవి జత కడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ తో .. వీరిద్దరి కాంబినేషన్ పై అంచనాలు భారీగా పెరిగాయి. కాగా, తండేల్ సినిమాను శ్రీకాకుళం బ్యాక్డ్రాప్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అటు నాగ చైతన్య కూడా ఈ సినిమాపైన చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నాడు. సో ప్రస్తుతం ఈ సినిమాపై అందరికి ఎక్స్పెక్టషన్స్ పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇంకా ఈ సినిమా సెట్స్ పైనే ఉన్నప్పటికీ .. అప్పుడే “తండేల్” సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ప్రత్యంగిరా సినిమాస్ వారు సొంతం చేసుకున్నారట. అది కూడా భారీ ధరల్లో తండేల్ మూవీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా పై అందరికి ఓ మేరకు అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ ఇప్పుడు ఓవర్సీస్ టాక్ చూస్తుంటే.. తండేల్ అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా చేస్తుందనిపిస్తుంది. అయితే, తండేల్ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా .. తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా మూవీగా నిలవబోతుంది. దానికి తగినట్టే మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.

కాగా, నాగ చైతన్య , సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ సినిమాతో హిట్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ జోడి మరోసారి అంతకుమించి మంచి టాక్ ను సంపాదించుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సాయి పల్లవి నటించిన ఏ సినెమాలైనా భారీ రేంజ్ లో అమ్ముడుపోతాయి. ఈ రకంగా చూస్తే.. తండేల్ ఓవర్సీస్ ధరలు భారీగా అమ్ముడు పోడానికి సాయి పల్లవి కూడా ఓ కారణం అయిఉంటుంది అనిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు తండేల్ సినిమా విడుదల తేదీ గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో టీజర్, మిగిలిన అప్ డేట్స్ ను ఇవ్వనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. కాగా, ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎటువంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మరి, తండేల్ మూవీ ఓవర్సీస్ టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetlike girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş