iDreamPost
android-app
ios-app

‘లియో’లో గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్! లోకేష్ మ్యాజిక్ కి ఆ టైమ్ సరిపోతుందా?

  • Author ajaykrishna Published - 12:39 PM, Wed - 23 August 23
  • Author ajaykrishna Published - 12:39 PM, Wed - 23 August 23
‘లియో’లో గూస్ బంప్స్ తెప్పించే ఇంటర్వెల్! లోకేష్ మ్యాజిక్ కి ఆ టైమ్ సరిపోతుందా?

రోజురోజుకి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. గతేడాది విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ కి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ అందించిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ తో ‘లియో’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ, విక్రమ్ సినిమాలతో తన యూనివర్స్ లో.. కార్తీ, కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ ని ప్రెజెంట్ చేసిన లోకేష్.. ఇప్పుడు తన యూనివర్స్ లో దళపతి విజయ్ ని పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ముగించుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న లియో.. ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా సెట్ చేసింది.

ఖైదీ – విక్రమ్ లకు పర్ఫెక్ట్ లింక్స్ పెట్టి.. బ్లాక్ బస్టర్ కొట్టేశాడు లోకేష్.. ఇప్పుడు లియోకి.. ఖైదీ – విక్రమ్ లకు ఎలా సింక్ చేస్తాడో చూడాలని ఆడియన్స్ తెగ ఆరాటపడిపోతున్నారు. ఆల్రెడీ లియో సినిమాలో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, గౌతమ్ మీనన్ లాంటి హేమహేమీలు ఉన్నారు. అసలు వాళ్ళందరూ ఎలా లోకి యూనివర్స్ లో ఇన్వాల్వ్ అవుతారనే ఆసక్తి నెలకొంది. పైగా లియోలో విజయ్ కి జంటగా త్రిష. మరి ఆమె హీరోయిన్ గా చేస్తుందా లేకపోతే విక్రమ్ ఏజెంట్స్ లో ఒకరిగా కనిపించనుందా అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ఇటీవల రిలీజ్ చేసిన సంజయ్ దత్, అర్జున్ క్యారెక్టర్స్ గ్లింప్స్ లో.. కథ తెలుగు స్టేట్స్ వైపు కూడా వెళ్తుందని అర్ధమవుతుంది.

ఈ క్రమంలో లోకేష్ ఈసారి టాలీవుడ్ నుండి కూడా ఓ స్టార్ ని పరిచయం చేయబోతున్నాడని.. అదికూడా రామ్ చరణ్ అని టాక్ బలంగా నడుస్తోంది. ఇక లియో మూవీ.. అక్టోబర్ 19న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. అయితే.. తాజాగా లియోకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. లియో ఇంటర్వెల్ బ్లాక్ దాదాపు 8 నిముషాలు ఉంటుందట. అదికూడా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ కలిగిస్తుందని చెబుతున్నారు. అంటే.. విక్రమ్ లో ఎలాగైనా సూపర్ ట్విస్ట్ ప్లాన్ చేసాడో.. ఈసారి లియోలో కూడా లోకేష్ ఏదైనా మాస్టర్ ప్లాన్ వేసాడేమో అని భావిస్తున్నారు. మరి ఆ 8 నిముషాల ఇంటర్వెల్ బ్లాక్ లో లోకేష్ ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడో చూడాలి. ఇక లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom